ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు రోజులుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సదస్సుకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస బేటీలు వేస్తున్న చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తెల్లారంగానే సదస్సులోకి ఎంట్రీ ఇస్తున్న చంద్రబాబు.., ఎప్పుడో రాత్రి పొద్దు పోయిన తర్వాత తిరిగి విడిదికి చేరుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. సీఎం లేకపోతే… డిప్యూటీ సీఎం హోదాలో పాలనా వ్యవహారాలు అన్నింటినీ పవనే చూసుకోవాలి కదా. అందుకే కాబోలు హైదరాబాద్ వెళ్లకుండా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్న పవన్ కల్యాణ్… ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ సాగుతున్నారు. రోజువారీ కార్యక్రాలను పర్యవేక్షిస్తున్న పవన్.. చంద్రబాబు లేని లోటును కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలో గురువారం సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్.. కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ తో కలిసి అమరావతికి వచ్చారు. చెన్నైలెని సింగపూర్ కాన్సుల్ జనరల్ కార్యాలయం నుంచి అమరావతి వచ్చిన వారు సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో… మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు పవన్ కల్యాణ్ తో బేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీతో సింగపూర్ కు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఏపీతో సింగపూర్ మరింత బలమైన సంబంధాలను కోరుతోందని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీ సర్కారు నుంచి కూడా ఆ దిశగా తమవంతు సహకారం అందిస్తామని వారికి పవన్ హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates