కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే పాప్‌కార్న్‌పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు రకాలుగా పాప్ కార్న్‌ను విభజించి.. మూడు స్థాయిలో పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో శనివారం నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పాప్ కార్న్‌ను మూడు విభాగాలుగా వర్గీకరించి పన్నుల మోత మోగించారు. అదేవిధంగా ధరించే దుస్తులపైనా మూడు రూపాల్లో పన్నులు నిర్ణయించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విషయంలో పన్నులను తగ్గించడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఫ్లైయాష్ ఇటుకల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్‌పై మాత్రం పన్నులు బాదేశారు. వీటి విక్రయాలను నిరేధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పాప్ కార్న్‌పై బాదుడు ఇలా..
- రెడీ-టు-ఈట్ పాప్‌కార్న్ ప్యాకింగ్ చేయకపోతే.. 5 శాతం జీఎస్టీ.
- రెడీ టు ఈట్ పాప్ కార్న్.. ప్యాకింగ్ చేసి.. కంపెనీ లేబుల్ వేస్తే.. 12 శాతం జీఎస్టీ.
- పంచదార కలిపిన పాప్‌కార్న్, కారామెల్ పాప్‌కార్న్‌లపై 18 శాతం జీఎస్టీ.
వాహనాలపై మోత ఇదీ..
- ఎలక్ట్రిక్ వెహికల్స్, సహా పాత లేదా సెకండ్ సేల్ కార్ల విక్రయాలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18-28 శాతానికి పెంచారు.
- వీటిలోనూ 5 ఏళ్లు పాతబడిన వాహనంపై 18 శాతం జీఎస్టీ
- 5-10 ఏళ్ల మధ్య పాతబడిన వాహనంపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు.
ధరలు తగ్గేవి ఇవీ..
- ఇంటికి వినియోగించే ఫ్లైయాష్ ఇటుకలపై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించారు.
- విటమిన్లు, మినరల్స్ యాడ్ చేసిన బలవర్ధకమైన బియ్యం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
- స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.