‘మూడవ శ‌నివారం’ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి నెలా వ‌చ్చే మూడవ శ‌నివారం నాడు స్వ‌చ్ఛాంద ప్ర‌దేశ్ దినోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి మూడవ శ‌నివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో నిర్వ‌హిస్తున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండో రోజు ప్రారంభ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తి నెలా మూడవ శ‌నివారం విధిగా అంద‌రూ స్వ‌ఛ్చాంధ్ర ప్ర‌దేశ్ దినోత్స‌వంలో పాల్గొనాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ చెత్త‌ను తొల‌గించ‌డంతోపాటు కాల్వ‌లలో మురికిని తొల‌గించ‌డంతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావాల‌ని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి తెలిపారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా తీసుకోవా ల‌ని సూచించారు.

మ‌రోవైపు.. సీఎం చంద్ర‌బాబు గ‌తంలోనూ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం విశేషం. అప్పట్లో ప్ర‌తి సోమ‌వారం ‘స్వ‌చ్ఛ ఏపీ’ పేరుతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. వైసీపీ హ‌యాంలో ఈ కార్య‌క్ర‌మానికి మంగ‌ళం పాడారు. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు.. వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.