వివాదాస్ప వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే.. నటి శ్రీరెడ్డి కాళ్లబేరానికి వచ్చారు. వైసీపీసానుభూతి పరురాలిగా మారి.. టీడీపీ, జనసేనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు.. అత్యంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఎంత నోటికి అంత మాట అనేయడం.. కూడా మహిళగా ఆమెకే చెల్లింది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లనే కాకుండా.. వారి కుటుం బాలను కూడా రోడ్డుకు ఈడ్చి.. మహిళలను కూడా ఇష్టానుసారం నోరు చేసుకున్న శ్రీరెడ్డి తాజాగా కాళ్ల బేరానికి వచ్చింది. ఏపీలో వివాదాస్పద సోషల్ మీడియా వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అనుచరులు, సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలకు లైకులు కొట్టి, ఫార్వర్డ్ చేసిన టీం సభ్యులపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో శ్రీరెడ్డికి మూడిందన్న వాదన వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరెడ్డి దిగి వచ్చారు. బుద్ధొచ్చింది.. క్షమించండి.. ఇకపై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, ప్రస్తుత ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలను ఉద్దేశించి సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేసింది. దీనిలో ఆమె వారిని .. తనను క్షమించాలని పదే పదే కోరుకుంది.
“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని శ్రీరెడ్డి పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తన వల్ల తన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపింది. “ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల(పవన్, చంద్రబాబు, లోకేష్, అనిత) గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు” అని పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా తనతోపాటు తన కార్యకర్తలు, సోషల్ మీడియా ఫాలోవర్లను వదిలేయాలని కూడా కోరింది. ఇక, నుంచి తాము జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 9, 2024 7:04 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…