వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. మంత్రి నారా లోకేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్‌ను పప్పు అంటారని.. అలా అనడమే కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు. తాజాగా ఆయన గుంటూరులో పర్యటించారు. ఇక్కడి జీజీహెచ్‌లో సహానా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోదన్నారు. దీనివల్లే మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. నారా లోకేష్‌ను పప్పు అనడమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు.
“రాష్ట్రంలో మహిళల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. దిశ యాప్‌ను కూడా తీసుకువచ్చాం. దీనివల్ల మహిళలకు, ఆడపిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా.. పోలీసులు వెంటనేస్పందించి.. వారిని కాపాడేవారు. అలాంటి దిశ చట్టం తాలూకు కాయితాలను నారా లోకేష్ స్వయంగా తగులబెడతాడా? ఇదేనా ఆయన జ్ఞానం..ఆయన తెలివి తేటలు.. అందుకేఆయనను పప్పు అంటారు. అలా అనడమే కరెక్ట్” అని జగన్ వ్యాఖ్యానించారు. హోం మంత్రి అనిత కూడా తల తొక లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహిళా హోం మంత్రి అయి ఉండి.. ఘటనలను ఇంత లైట్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించేందుకే ప్రాదాన్యం ఇస్తున్నట్టు జగన్ చెప్పారు. నారా లోకేష్ చెప్పినట్టే నడుస్తున్నారని అన్నారు. కూటమి సర్కారు హయాంలో ఇప్పటి వరకు 77 మంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయని జగన్ లెక్కలు చెప్పారు. ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారని, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. దిశ యాప్ ఉండి ఉంటే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత కూడా ఉండేవని జగన్ అన్నారు. కానీ, దిశ పోలీసు స్టేషన్లను తీసేశారని, దిశ యాప్‌ను కూడా రద్దు చేశారని ఆయన అన్నారు. దీని వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.