Political News

జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి

వైసీపీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. సాధార‌ణం నుంచి కీల‌క‌నాయ‌కుల వ‌ర‌కు కూడా చాలా మంది క్యూక‌ట్టుకుని మ‌రీ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీల‌క నేత‌, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు జోగి ర‌మేష్ కూడా చేరిపోతున్న‌ట్టు తెలిసింది. తాజాగా జోగి అనుచ‌రుల‌కు చెందిన సోష‌ల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడ‌హో!’ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. “ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పార్టీలోకి మా అన్న‌మారుతున్నాడు” అని జోగి అనుచ‌రులు వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో జోగి ర‌మేష్‌.. కుటుంబ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌తో రాజ‌కీయాలు ప్రారంభించిన జోగి.. వైసీపీ హ‌యాంలో మంత్రి అయ్యారు. అయితే.. దీనికి ముందు ఆయ‌న చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసం పై దాడి చేసేందుకు కూడా ప్ర‌య‌త్నించారు. దీంతో అప్ప‌ట్లోనే పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక‌, ఇప్పుడు ఆ కేసు విచార‌ణ పుంజుకుంది.

మ‌రోవైపు.. జోగి కుమారుడు.. జోగి రాజీవ్‌.. అగ్రిగోల్డ్ భూముల కేసులో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్నాళ్లు జైల్లో ఉండ‌డం.. ఇటీవ‌ల బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా జోగి ర‌మేష్ యూట‌ర్న్ తీసుకోవ‌డం.. వైసీపీకి గుడ్ బై చెబుతున్నార‌న్న స‌మాచారం బ‌య‌టకు రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వైసీపీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా ఉన్న జోగి ర‌మేష్‌.. జ‌గ‌న్ ఎంత చెబితే అంత అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

కేసులు న‌మోదైన‌ప్పుడు కూడా.. జోగి పార్టీని, జ‌గ‌న్‌ను కూడా వెనుకేసుకు వ‌చ్చారు. అయితే, ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండ‌డం.. చంద్ర‌బాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో పార్టీ మార్పు దిశ‌గా జోగి ఆలోచ‌న చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది. పార్టీ మారాల్సి వ‌స్తే.. జ‌న‌సేన వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. తాను గతంలో చేసిన అన్ని ప‌నుల‌ను వైసీపీ పెద్ద‌లు చెబితేనే చేశాన‌ని చెప్పుకొనే అవ‌కాశం కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 20, 2024 10:53 am

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

18 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago