వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామి స్వరూపానందేంద్రకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాలకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 1) భూములు రద్దు. 2) తిరుమలలో కడుతున్న భవనాల తనిఖీ. ఈ రెండు అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విశాఖలో శారదా పీఠం ఉన్న నేపథ్యంలో దీనిని విస్తరించేందుకుగాను.. గత వైసీపీ హయాంలో భీమిలి వద్ద.. 15 ఎకరాలను స్వామి పీఠం తీసుకుంది. అయితే.. మార్కెట్ వాల్యూ కంటే చీప్‌గా దీనిని అప్పగించారన్న అభియోగాలు ఉన్నాయి.
మార్కెట్ ధర ఎకరాకు రూ.15 కోట్లు ఉంటే.. ప్రభుత్వ ధర రూ.2 కోట్లకు అటు ఇటుగా ఉంది. అయితే.. వైసీపీ హయాంలో స్వామి భక్తి ప్రదర్శించిన అప్పటి సీఎం జగన్.. శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను కూడా ఒక్కొక్క ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించారు. దీంతో అప్పటి నుంచి ఈ వివాదంపై టీడీపీ నాయకులు తరచుగా స్పందిస్తూనే ఉన్నారు. విశాఖ నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా.. జగన్ సర్కారు మాత్రం ధార్మిక కార్యక్రమాలకు కేటాయించాం కాబట్టి.. తప్పులేదని సమర్థించింది. ఇక, తాజాగా ఆ భూముల కేటాయింపును రద్దుచేస్తూ.. చంద్రబాబుసర్కారు నిర్ణయం తీసుకుంది.
అయితే.. సర్కారు నిర్ణయంపై మఠం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. ఒకసారి కేటాయింపు జరిగిన తర్వాత.. తాము రిజిస్ట్రేషన్ సొమ్మును కూడా చెల్లించిన తర్వాత.. రద్దు చేయడం కుదరదన్నది మఠం తాలూకు న్యాయవాదులు చెబుతున్న మాట. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక, 2వ విషయాన్ని చూస్తే.. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుమల కొండపై ఇదే శారదా పీఠానికి బూములు కేటాయించారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.
బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరువలో కేటాయించిన భూమిలో శారదా పీఠం నిర్మాణాలు కూడా చేస్తోంది. అయితే.. నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి నిగ్గు కూడా తేల్చాలని చంద్రబాబు సర్కారు ఆదేశించింది. ఈ బాధ్యతలను టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు అప్పగించడం గమనార్హం. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయాలని ఆదేశించింది.
This post was last modified on October 20, 2024 11:21 am
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…