Movie News

డ్రాగన్ అనుకున్న టైంకి రాగలదా

ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం ఈజీగా పట్టేలా ఉంది. తాజాగా కిమ్స్ ఆసుపత్రి విడుదల చేసిన వీడియోలో డాక్టర్ మాట్లాడుతూ అంతా సవ్యంగా జరిగిందని, ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండే ఎన్టీఆర్ త్వరగా కోలుకునేందుకు ఏమేం చేయాలో అవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తున్నారని, మునుపటి జోష్ తో త్వరలో చూడొచ్చని భరోసా ఇచ్చారు.

ఇదంతా బాగానే ఉంది కానీ డ్రాగన్ విడుదల తేదీగా ప్రకటించిన జూన్ 11ని టీమ్ అందుకుంటుందా లేదానే దాని మీద రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ తారక్ కనక డిసెంబర్ నుంచి సెట్లో అడుగు పెడితే అక్కడి నుంచి కేవలం అయిదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హడావిడిని అస్సలు ఒప్పుకోరు. కెజిఎఫ్ కూడా ఒక శిల్పం చెక్కినట్టు నెలలు సంవత్సరాలు తీశారు. డ్రాగన్ స్క్రిప్ట్ దశలోనే చాలా సమయం డిమాండ్ చేసింది.

యూనిట్ టాక్ ప్రకారం ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి. రెండో భాగానికి సంబంధించిన సన్నివేశాల కన్నా ముందు ఫస్ట్ పార్ట్ బ్యాలన్స్ ని గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేశారట. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో మునుపటిలా మారిపోవడం ఖాయం. అయితే లుక్, ఫిజిక్ ఏ మాత్రం మారకుండా కోచ్ సహాయంతో ఆల్రెడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఈ లెక్కన డ్రాగన్ వాయిదా ఉండకపోవచ్చు కానీ సీక్వెల్ కొంచెం ఆలస్యం కావొచ్చు. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ దొరకడంతో డ్రాగన్ పనులతో పాటు సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ నీల్ బృందం ఉన్నట్టు వినికిడి. ఫౌజీ, స్పిరిట్ నుంచి వచ్చే ఏప్రిల్ కంతా ప్రభాస్ ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత కల్కి 2 ఒకటే బ్యాలన్స్ ఉంటుంది. అటుపై ఫ్యాన్స్ కోరుకుంటున్నది సలార్ 2నే. మరి డ్రాగన్ కనక ఆన్ టైం అన్నీ ఫినిష్ చేసుకుంటే కనక ఇక్కడ చెప్పుకున్నట్టే ప్లానింగ్ జరిగిపోతుంది.

This post was last modified on August 17, 2026 5:12 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 hour ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

7 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

8 hours ago