జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, బీజేపీకి మౌత్ పీస్‌గా మారనున్నారనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగఢ్‌లో జరిగిన ఎన్డీయే కూటమి నాయకుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు పవన్‌తో చర్చించారు. ఏపీలో ఆయన సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఉంటానని చేసిన ప్రకటన దరిమిలా.. హిందూ సమాజం ఆయనతో ఉన్నట్టు తాము గుర్తించామని కూడా చెప్పినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో బీజేపీ హిందూత్వకు.. పవన్ చెప్పిన సనాతన ధర్మానికి మధ్య మంచి లింకు ఉండడంతో పవన్ సేవలను వినియోగించుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. వీటిలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఉన్నాయి. అయితే.. జార్ఖండ్ సంగతి తాము చూసుకుంటామని.. మహారాష్ట్రలో బీజేపీకి మౌత్ పీస్‌గా ఉండాలని పవన్‌ను కోరినట్టు సమాచారం.
దీనికి కూడా కారణం ఉంది.. మహారాష్ట్రంలో పెద్ద యుద్ధమే జరగనుంది. ఇక్కడ బీజేపీ పుంజుకుని అధికారం దక్కించుకోకపోతే.. 2022లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. తర్వాత జరిగిన సమీకరణలు వంటి విషయంలో బీజేపీ అభాసుపాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ గెలుపును కమల నాధులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లు ‘మహాయుతి'(అతి పెద్ద కూటమి)గా ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి.
అయితే.. శివసేన(సీఎం ఏక్‌నాథ్ వర్గం), ఎన్సీపీ(డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం) రెండూ కూడా.. చీలిక పార్టీలు. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల నుంచి విడిపోయి.. విడివిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీటి మనుగడ కూడా ఎన్నికలపైనే ఆధారపడి ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు దక్కాయి.
ఇప్పుడు ఈ సంఖ్యను 150కి చేర్చడంతోపాటు.. మరోసారి మహాయుతి ప్రభుత్వం కొలువుదీరాలనే సంకల్పంతో ఉన్నారు. దీంతో పవన్ వంటి వారిని రంగంలోకి దింపి.. హిందూ సెంటిమెంటునుతమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచార బాధ్యతల్లో పవన్‌కు కీలక భాగస్వామ్యం కల్పించాలన్నది కమల నాథుల ఆలోచన. దీనికి పవన్ వెళ్తారా? వెళ్లరా? అనేది చూడాలి.
This post was last modified on October 18, 2024 12:51 pm
2018లో విడుదలైన నేల టికెట్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ మాళవిక శర్మ. తాజాగా ఆమె గోపీచంద్…
వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో…
పుష్ప 2 ది రూల్ కు పని చేస్తున్న సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి స్టూడియో నుంచి తీసుకున్న పిక్…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి విడుదలకు ముందు ఒక ఫ్రెంచ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది…
ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు…
ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘విరాట పర్వం’ తర్వాత అతను…