పునర్ఙన్మల కాన్సెప్ట్ అన్నది తెలుగు సినిమాలకు అచ్చివచ్చిన లైన్. ఈ లైన్ మీద వచ్చిన సినిమాలకు 90 శాతం సక్సెస్ గ్యారంటీ వుంటుంది. ఙానర్ ఏదయినా కాన్సెప్ట్ ఇదే తీసుకుంటే చాలు ఙనం ఓకె అనేయడం తెలుగు సినిమాల వరకు ఙరుగుతూ వస్తోంది. అలాంటి కాన్సెప్ట్ కు ఎమోషనల్ టచ్ ఇస్తూ తీసిన సినిమా శ్యామ్ సింగ రాయ్. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో విలనిఙం, కులాల అంతరాలు వుంటాయి. కాలానికి అంతరించిపోయిన ఓ సమస్యను ఙనాలకు వివరించడానికి ఈ పునర్ఙన్మ కాన్సెప్ట్ ను వాడుకోవడం అన్నది ఈసారి కాస్త నావెల్ పాయింట్ గా చెప్పుకోావాలి.
ఇంతకీ ఎస్ఎస్ఆర్ కథేంటీ అంటే..వాసుదేవ్ (నాని) ఓ అప్ కమింగ్ దర్శకుడు. అతగాడు తీసిన తొలి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ వెంటనే మరో రెండు సినిమాల ఆఫర్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అతగాడు బెంగాలీ రచయిత శ్యామ్ సింగ రాయ్ కథలు అక్షరం అక్షరం కాపీ కొట్టేసాడని ఎస్ ఆర్ పబ్లిషింగ్ సంస్థ కేసు పెడుతుంది. దాంతో వాసుదేవ్ ను అరెస్ట్ చేస్తారు. వాసుదేవ్ ప్రేయసి కీర్తి (కీర్తి శెట్టి) సైకలాఙికల్ గా వాసుదేవ్ కేసును స్టడీ చేయిస్తుంది. హిప్నటైఙ్ చేసినపుడు శ్యామ్ సింగ రాయ్ నే మళ్లీ వాసుదేవ్ గా ఙన్మించాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ శ్యామ్ సింగరాయ్ కధేంటీ అన్నది మిగిలిన సినిమా.
శ్యామ్ సింగ రాయ్ ఓ మంచి సినిమా. మంచి సినిమా అని అనడం ఎందుకంటే, ఓ కథను తయారు చేసుకున్నపుడు అది కూడా కమర్షియల్ గా ప్రూవ్ అయిన పునర్ఙన్మల ఫార్ములాలో రాసుకున్నపుడు, రొటీన్ టేకింగ్ తో వెళ్లిపోవచ్చు. కానీ అలా కాకుండా కాలంలో కలిసిపోయి, సమసిపోయిన ఓ సమస్యను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అలాగే దాని నేపథ్యంలో పీడిత మానవుల పక్షాన నిలిచి కొన్ని మంచి మాటలు వినిపించడం వంటివి కలిసి ఈ సినిమాను మంచి సినిమాగా మార్చాయి. ఆ చిన్న మార్పు, దాని కోసం రాసుకున్న డైలాగులు లేకపోతే ఇదీ ఫక్తు మామూలు కమర్షియల్ సినిమానే.
శ్యామ్ సింగరాయ్ ఎపిసోడ్ మొత్తం వేరు. ఆ ఙానర్, ఆ కాలం, ఆ టేకింగ్. అందుకోసం రాసుకున్న డైలాగులు, లోకేషన్లు, ఆ ఎపిసోడ్ లో హీరో నాని గెటప్ నటన ఇలా ప్రతి ఒక్కటీ వేరు.ఇవన్నీ కలిసి సినిమాను విభిన్నంగా మార్చాయి. ఈ టోటల్ పాత ఙన్మ ఎపిసోడ్ మీద దర్శకుడు చేసిన డిటైలింగ్ వర్క్ బాగుంది. అందుకే ఈ సినిమా గురించి కాస్త మాట్లాడుకునేలా మారింది.
శ్యామ్ సింగ రాయ్ తొలిసగం రెగ్యులర్ ఫార్మాట్ లోనే వుంటుంది. మామూలుగానే స్టార్ట్ అవుతుంది. నడుస్తుంది. కానీ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ బాగుంటుంది. వర్ణం అనే షార్ట్ ఫిలిం కోసం చేసిన వర్క్ దర్శకుడి అభిరుచికి అద్దం పడుతుంది. చాలా పునర్ఙన్మల సినిమాల మాదిరిగానే ఏదో ఒక ఇన్సిడెంట్ ఙరిగి పునర్ఙన్మకు లీడ్ కావాలి. ఇక్కడా అదే ఙరుగుతుంది. అయితే ఆ లీడ్ తో అలా చటుక్కున పునర్ఙన్మలోకి వెళ్లిపోకుండా, స్మూత్ గా అందులోకి తీసుకెళ్లిన తీరు బాగుంది.
సినిమా మలిసగం ప్రారంభమై గత ఙన్మలోకి సినిమా మారిపోయిన తరువాత అంతా కొత్తగా వుంటుంది. ప్రేక్షకులను ఒక కొత్త ఆంబియన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. 70ల కాలం, పశ్చిమ బెంగాల్ నేపథ్యం, దేవదాసీ వ్యవస్థ అరాచకాలు, మార్కిస్టు దృక్పధం ఇవన్నీ కలిసి ఓ వైవిధ్యమైన సినిమాను చూపిస్తాయి. ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కాస్త స్లో నెరేషన్ గా వుండొచ్చు. కానీ కనెక్ట్ అయిన వారికి చాలా బాగుంది అనిపిస్తుంది. కనెక్ట్ కాని వారికి ‘బానే వుంది కానీ కాస్త స్లోగా వుంది’ అనిపించవ్చు. అయితే అందరూ కనెక్ట్ అయ్యేది అందులో వున్న ఎమోషన్ కు. హీరోయిఙం ఎలివేట్ చేస్తూనే, లవ్ అండ్ ఎమోషన్ కనెక్ట్ చేస్తూ సాగిన ఈ ఎపిసోడ్ నే సినిమాకు కీలకం.
దర్శకుడు రాహుల్ కు విషయం వుంది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. చాలా చోట్ల చేసిన, చూపించిన డిటైలింగ్ వర్క్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఈ సీన్ అనవసరం కదా? అనేలా ఒక్క సీన్ కూడా రాసుకోలేదు. ప్రతి దానికి ఓ లింక్ వుండేలా, అవసరం వుండేలా చూసుకున్నాడు. కోర్టు సీన్లు కూడా ఏదో టేకిట్ ఈఙీగా తీసుకోలేదు. సీనియర్ లాయర్ బాడీ లాంగ్వేఙ్, కోర్టు లాంగ్వేఙ్ అన్నీ పక్కాగా వుండేలా చూసుకున్నాడు. కోర్టులో బలమైన ట్విస్ట్ రాసుకున్నా కూడా ఎవిడెన్స్ దగ్గర తక్కువ చేయలేదు. సినిమా ముగింపులో ఒక్కటంటే ఒక్క డైలాగు కూడా లేకుండా తీయడం కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. కానీ అక్కడ కూడా దర్శకుడి ఆలోచన ప్రతిభ తొంగిచూస్తుంది. దర్శకుడి మీద మణిరత్నం ప్రభావం కొంత కనిపిస్తుంది. అయితే సినిమాలో లాఙిక్ మిస్ లు కూడా వున్నాయి. లేదా వీటినే సినిమాటిక్ లిబర్టీ అని కూడా అనచ్చేమో…దెబ్ల తగలక ముందు రాసిన/తీసిన షార్ట్ స్టోరీ మీద పునర్ఙన్మ ప్రభావం వుండడం, కాపీ రైట్ చట్టం కింద కేసు పెడితే, ఏదో హత్య చేసినంత హడావుడి చెేసి,నోటీస్ లేకుండానే ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేసేయడం, ఒక్క సినిమా తీయడానికే టైమ్ అంతా సరిపోతే, అప్పటికే మరో రెండు స్క్రిప్ట్ లు రాసి ఇచ్చాడనడం, వాటి సబ్ఙెక్ట్ బయటకు వెల్లడి కాకుండానే వాటి మీద కూడా కేసు పెట్టడం. ఇవన్నీ కూడా ఆ కోవలోకే వస్తాయి.
సినిమాను చాలా మంది విఙవల్ ట్రీట్ గా భావించవచ్చు. కానీ సంభాషణలు కూడా చాలా బలంగా, అర్థవంతంగా వున్నాయి. నేల, నీళ్లు కిందే వున్నపుడు కిందవాళ్లు అంటరాదు అనడం ఏమిటి? కడుపు నింపుకోవడం కోసం దానికి కిందా, పైనా వున్నవాటిని అమ్ముకోవడం లాంటి డెప్త్ తో కూడిన సంభాషణలు అనేకం వున్నాయి.
టెక్నికల్ గా సినిమా చాలా బలంగా వుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, నేపథ్యసంగీతం, నెలరాఙును..ఇలరాణిని కలిపింది సిరివెన్నెల అన్న పాట కానీ అన్నీ బలమైన అంశాలే. టోటల్ గా ఓ మంచి ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీని చూడాలంటే శ్యామ్ సింగ రాయ్ ను చూసేయచ్చు.
ప్లస్ పాయింట్లు
నాని..సాయిపల్లవి
సినిమాటోగ్రఫీ
మాటలు
నేపథ్యసంగీతం
మైనస్ పాయింట్లు
ద్వితీయార్థం స్లో నెరేషన్
ఫినిషింగ్ టచ్: ఙన్మ ఙన్మల బంధం
Rating: 3/5
This post was last modified on December 24, 2021 3:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…