వివాహ ఆహ్వాన పత్రిక అంటే…సామాన్యులకైనా, ధనికులకైనా చాలా ప్రత్యేకం. గతంలో అయితే ఏమో గానీ… సంపద పెరిగిన ప్రస్తుత కాలంలో అయితే వివాహ ఆహ్వాన పత్రికలకు లక్షల మేర ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు. అంబానీ లాంటి వారు అయితే పెళ్లి పత్రికలకే కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇక రాజకీయ నేపథ్యం ఉన్న వారైతే తమ అభిమాన నేతల ఫొటోలు వేసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ తరహా పెళ్లిళ్లకు ఆయా నేతలు వస్తారో, రారో తెలియదు గానీ… పెళ్లి పత్రికలు మాత్రం కలర్ ఫుల్ గా ఉంటాయి.
అలా కలర్ ఫుల్ వివాహ ఆహ్వాన పత్రిక ఒకటి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పత్రికలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి ఫొటోలను ముద్రించి మరీ ఆ పెళ్లి వేడుకల నిర్వాహకులు మురిసిపోయారు. ఈ వివాహం ఫిబ్రవరి 7న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలోని బొమ్మూరు గ్రామంలోని చెరుకూరి పంక్షన్ హాల్ లో జరగనుంది.
ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన ప్రత్యూష, లక్ష్మీ వరుణ్ లకు పెళ్లి జరగనుంది. ప్రత్యూష తరఫు వారు ముద్దాల వారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన శుభలేఖ పేరిట ముద్రించిన ఈ పత్రిక ఫ్రంట్ పేజీలోనే జగన్,దంపతుల నిలువెత్తు ఫొటో ఉంది. ఆ తర్వాత లోపల రెండో పేజీలోననూ ఆ దంపతుల ఫొటోలను ముద్రించిన నిర్వాహకులు…మూడో పేజీలోనే తిరిగి జగన్ దంపతుల నిలువెత్తు ఫొటోలను ముంద్రించారు. మీ రాక మాకెంతో ఆనందం…మీ దీవెనలే మా చిరంజీవులకు శ్రీరామరక్ష అని ముంద్రించారు.
ఇక ఈ పత్రికను ఇలా కలర్ ఫుల్ గా తీర్చిదిద్దింది పెళ్లి కుమార్తె తండ్రి ముద్దాల తిరుపతి రావు అట. వైసీపీ హయాంలో ఏపీ కాపు కార్పొరేషన్ కు డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ట్రేడ్ యూనియన్ అద్యక్షులుగానూ కొనసాగుతున్నారు. తిరుపతి రావుకు వైసీపీ కీలక నేత జక్కంపూడి రాజా అన్నా కూడా విపరీతమైన అభిమానం ఉన్నట్టుంది. జగన్, భారతి ఫొటోల కింద ఆయన రాజా దంపతుల పేర్లను, ఇంకో స్థానిక నేత శ్రీనివాసులు రెడ్డి దంపతుల పేర్లను ప్రస్తావించారు. ఈ పత్రిక నిజంగానే ఆకట్టుకుంటోందని చెప్పక తప్పదు.
This post was last modified on January 31, 2025 10:25 am
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది…
అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి…
ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం…
హీరోల దగ్గరికి వెళ్లే ప్రతి కథా ఓకే అయిపోదు. కొన్ని తమకు నచ్చక, కొన్ని సూట్ కావేమో అన్న ఉద్దేశంతో…
డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం ప్రతి ఒక్కరికి అనుభవమే. కాకపోతే ఫలానా సినిమా చేయకపోతే…
ఎనుముల రేవంత్ రెడ్డి… సిసలైన రాజకీయాన్ని టీడీపీలో నేర్చుకుని కాంగ్రెస్ లో చేరిన గండరగండుడు. రేవంత్ వచ్చేదాకా తెలంగాణలో కాంగ్రెస్…