నిన్నా మొన్న పరాశక్తి మీద తమిళ తెలుగు మీడియాలో చిన్నపాటి దుమారమే రేగింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీ బృందాలు ఆ టైటిల్ తమదంటే తమదని పోటాపోటీగా ప్రకటించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మా బ్యానర్లకు ఆ పేరు రిజిస్టర్ అయినట్టుగా ఆధారాలను ట్విట్టర్ లో బహిర్గతం చేయడంతో ఇష్యూ మరింత వేడెక్కింది.
ఇంకోవైపు ఇది శివాజీ గణేశన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ కావడంతో చర్చ మరింత తీవ్రంగా జరిగింది. చివరికి రెండు నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులు కలుసుకుని రాజీ పడ్డామంటూ తాపీగా ఒక ఫోటో రిలీజ్ చేయడంతో కాంట్రావర్సికి శుభం కార్డు వేశారు.
ఫైనల్ గా పరాశక్తి టైటిల్ శివ కార్తికేయన్ కు ఇస్తూ ఇతర భాషల్లో తాను వేరే పేరు పెట్టుకోవడానికి విజయ్ ఆంటోనీ ఒప్పుకున్నాడు. ఈ మొత్తం కాన్సెప్ట్ లో లాభ పడింది ఎవరయ్యా అంటే బిచ్చగాడు హీరోనే. ఎందుకంటే తన సినిమాలు ఎప్పుడో మార్కెట్ కోల్పోయాయి.
వరస డిజాస్టర్లతో అసలు ఎన్ని సినిమాలు తీస్తున్నాడో, ఎన్ని రిలీజ్ అయ్యాయో ఫ్యాన్స్ కూడా వెంటనే చెప్పలేనంత సూపర్ ఫ్లాపులతో ఇమేజ్ తగ్గించుకున్నాడు. ఆ మధ్య తుఫాన్, హత్య అనే ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చాయనే సంగతే ఎవరికీ తెలియదు. ఇప్పుడీ పరాశక్తి పుణ్యమాని పైసా ఖర్చు లేకుండా ఉచిత పబ్లిసిటీ వచ్చేసింది.
సరే మార్కెటింగ్ ప్రపంచంలో హైప్ కోసం ఇలాంటి సర్కస్ లు తప్పవు కాబట్టి మరీ తప్పు అని కూడా అనలేం. ఇక్కడ పరాశక్తి కూడా లాభపడింది. వివాదం వల్ల టీజర్ తర్వాత కొత్త పోస్టర్లు కొన్ని వదిలింది. దాని వల్ల ఇందులో నటించిన శివకార్తికేయన్, శ్రీలీల పోషించిన పాత్రల మీద అటెన్షన్ వచ్చింది.
ఈ ప్రాజెక్టుని వదులుకున్న సూర్య ఎంత పెద్ద పొరపాటు చేశాడోననే కోణంలో నెటిజెన్లు చర్చించుకున్నారు. ఇదంతా బజ్ కు ఉపయోగపడేదే. వీటిలో ముందుగా రిలీజయ్యే సినిమా విజయ్ ఆంటోనీదే. వేసవిలో తీసుకొస్తారు. పరాశక్తిని దసరా లేదా దీపావళికి టార్గెట్ చేసుకుంటున్నారని సమాచారం.
This post was last modified on January 31, 2025 9:53 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…