ఇంకో ఆరు రోజుల్లో పట్టుదల విడుదల కానుంది. అజిత్ హీరోగా మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ కాగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కెసెండ్రా కీలక పాత్రలు పోషించారు. మనకు పరిచయమున్న క్యాస్టింగే ఇదంతా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అసలైన ఆకర్షణ.
ఇన్ని ఉన్నా పట్టుదల వస్తోందనే సంగతి తెలుగు ఆడియన్స్ కి రిజిస్టర్ చేయడంలో టీమ్ విఫలమవుతోంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. తమిళంలో దర్శకుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ హీరో వైపు నుంచి ఎలాంటి చప్పుడు లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే.
బజ్ సంగతి ఎలా ఉన్నా తెలుగు మార్కెట్ ని అజిత్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. పాతికేళ్ల క్రితం ప్రేమలేఖ సూపర్ హిట్ అయినప్పుడు తనకో మార్కెట్ ఏర్పడింది. వరసగా డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. గ్యాంబ్లర్ నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చింది.
కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్టు లేకపోయింది. కోలీవుడ్ లో భీకరంగా ఆడిన విశ్వాసం, వివేకం, వలిమై లాంటివి ఇక్కడ కనీసం యావరేజ్ అనిపించుకోలేదు. తెగింపు సూపర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడీ పట్టుదల మీద హైప్ లేకపోవడం చూస్తే ఓపెనింగ్స్ మీద అనుమానం వస్తోంది.
అసలే ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 7 తండేల్ వస్తోంది. దానికి జరుగుతున్న పబ్లిసిటీ చూస్తున్నాం. నాగచైతన్య చెన్నై వెళ్లి మరీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ మంచి రిలీజ్ దక్కేలా నిర్మాత అల్లు అరవింద్ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ మాత్రం పట్టుదల అజిత్ మేకర్స్ కి లేకపోయిందని అభిమానులు వాపోతున్నారు.
అజిత్ బయటికి రాకపోయినా సరే సినిమాకు సంబంధించి ఏదో ఒక హడావిడి జరుగుతూ ఉంటేనే అంతో ఇంతో జనం దృష్టిలో పడుతుంది. అసలే ఇది వరస డిజాస్టర్లతో కిందా మీద పడుతున్న లైకా ప్రొడక్షన్స్ నుంచి వస్తోంది. పట్టుదలయినా ఊరట కలిగిస్తుందేమోనని ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 31, 2025 10:14 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…