తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోమారు తెర మీదకు వచ్చి ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాలకు ముందు చాలాకాలం పాటు సినిమాల్లో నటించిన జయలలిత భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చకున్న జయ..సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేకు ముచ్చెమటలు పట్టించారు. తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ జయ తనదైన ముద్ర వేశారని చెప్పక తప్పదు.
సరే… అదంతా గతమైతే సీఎం కుర్చీలో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన జయ చాలా రోజుల పాటు ఆసుపత్రి బెడ్ పైనే ఉండి చివరకు ప్రాణాలు వదిలారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బాగానే సంపాదించిన జయ… చనిపోయే నాటికి ఏకంగా రూ.913 కోట్లను పోగేశారని తమిళనాడు సర్కారు తేల్చింది. అయితే చనిపోయేదాకా అవివాహితురాలిగానే ఉండిపోయిన జయకు వారసులు లేని కారణంగా ఆమె ఆస్తులను ప్రభుత్వం కర్ణాటక స్పెషల్ కోర్టు రక్షణలో ఉంచింది. జయకు తామేవారసులమంటూ తెర మీదకు వచ్చిన దీప గానీ, దీపక్ గానీ ఆమె వారసులు కానే కాదని కోర్టు ఇదివరకే తీర్పుచెప్పింది.
తాజాగా వారసులు ఎవరూ లేని కారణంగా జయ ఆస్తులను తమిళనాడు సర్కారుకు అప్పగించేందుకు కర్ణాటక స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జయ ఆస్తులను త్వరలోనే తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. సీజ్ చేసిన నాడు రూ.913 కోట్ల విలువ ఉన్న సదరు ఆస్తుల విలువ ఇప్పుడు ఏకంగా రూ.4 వేల కోట్ల పైమాటేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే… తమిళనాడు సర్కారీ ఖజానాకు జయ రూ.4 వేల కోట్ల ఆస్లులు సంపాదించి వెల్లిపోయారన్న మాట.
వందల కోట్ల విలువ కలిగిన ఆస్తుల విలువ పదేళ్లలోనే ఇలా వేల కోట్లకు ఎలా చేరిందని అందరికీ అనుమానం రావచ్చు. అందుకే,… ఆమె ఆస్తుల్లో ఏమేం ఉన్నాయో తెలుసుకుంటే… ఆ అనుమానాలు పటాపంచలు కావడం తథ్యమేనని చెప్పాలి. జయ ఆస్తుల్లో మెజారిటీ భాగం భూములే. జయ పేరిట ఏకంగా 1,562 ఎకరాల భూములున్నాయి. 27 కిలో బంగారాన్ని ఆమె కొనుగోలు చేశారు. 10 వేల చీరలతో పాటు 750 జతల ఖరీదైన పాదరక్షలు ఉన్నాయి. ఇక అత్యంత ఖరీదైన ఇంపోర్టెట్ గడియారాలు కూడా ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి.
This post was last modified on January 31, 2025 10:29 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…