బుట్టబొమ్మ పూజా హెగ్డే తెరమీద కనిపించి రెండేళ్లకు దగ్గరవుతోంది. బాలీవుడ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. వరస ఫ్లాపులతో తెలుగు తమిళ అవకాశాలు తగ్గిపోయాక దృష్టంతా హిందీ మీద పెట్టేసింది. ఒక బలమైన హిట్టు పడితే మళ్ళీ పుంజుకుంటుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
అసలైన పరీక్ష ఇవాళ మొదలుకానుంది. షాహిద్ కపూర్ తో నటించిన దేవా థియేటర్లకు వస్తోంది. ఎంతకైనా తెగించే ఒక పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందిన దేవాలో పూజా హెగ్డే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పెర్ఫార్మన్స్ ఉన్న పాత్ర దక్కించుకుందట. ఫలితం మీద చాలా నమ్మకం పెట్టుకుంది.
మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దేవాకు డైరెక్టర్. పన్నెండేళ్ల క్రితం ఈయన తీసిన ముంబై పోలీస్ ఒక సెన్సేషన్. దాన్నే సుధీర్ బాబుతో తెలుగులో హంట్ గా రీమేక్ చేస్తే తేడా కొట్టడం వేరే సంగతి. ఈ స్టోరీకె కొన్ని కీలక మార్పులు చేసి దేవాగా తీశారనే ప్రచారం ముంబై వర్గాల్లో ఉంది కానీ యూనిట్ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది.
ఇది పూర్తిగా వేరే కథని, ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుందని డిఫెండ్ చేస్తోంది. షాహిద్ సైతం హిట్టు కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. కబీర్ సింగ్ తర్వాత మళ్ళీ అంత పెద్ద సక్సెస్ దొరకలేదు. దేవా కనక ఆడితే మార్కెట్ తిరిగి బలపడుతుందని ఆశపడుతున్నాడు.
పూజా హెగ్డేకు మాత్రం ఈ ఏడాది అత్యంత కీలకం. దేవా తర్వాత మేలో సూర్యతో నటించిన రెట్రో వస్తుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పూజా లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. తలపతి విజయ్ తో నటించిన జన నాయగన్ విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తారా లేక 2026 సంక్రాంతికి వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలు పూజా హెగ్డే కెరీర్ ని నిర్ణయించబోతున్నాయి. ఇవి కాకుండా హే జవానీ హైతో ఇష్క్ హోనా హీ తా అనే మరో చిత్రం నిర్మాణంలో ఉంది కానీ ప్రాధాన్య పరంగా పైన చెప్పినవే చాలా కీలకం కాబోతున్నాయి. చూడాలి ఎలాంటి బ్రేక్ వస్తుందో.
This post was last modified on January 31, 2025 9:47 am
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…