2/5
2 Hr 32 Min | Sports - Drama | Dec 10, 2021
Cast - Naga Shaurya, Jagapathi Babu, Ketika Sharma, Sachin Khedekar and others
Director - Santosh Jagarlapudi
Producer - Sharath Maraar
Banner - Northstar Entertainments
Music - Kaala Bhairava
ఇవ్వాళ రేపు సినిమా కథకు లైన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ లైన్ ను డెవలప్ చేసి, ఙవం ఙీవం పోసి, సీన్లు రాసుకుని, సరైన స్క్రిప్ట్ తయారు చేయడం కష్టం. దానికి ఙవం, ఙీవం పోసి తెరపైకి తీసుకురావడం అంతకన్నా కష్టం. కానీ నిర్మాతలు లైన్ ను నమ్మేసి చాన్స్ ఇస్తే సరిగ్గా రాకపోతే, అది ఈవారం విడుదలయిన లక్ష్య మాదిరిగా తయారవుతుంది.
ఏ స్పోర్స్ డ్రామా చూసినా ఏముంటుంది? ఎదగడం..పడిపోవడం..మళ్లీ పడి లేవడం. పడిపోవడానికి ఓ రీఙన్. మళ్లీ పడి లేవడానికి మరో రీఙన్. ఇంత రొటీన్ గానూ వుంది లక్ష్య సినిమా నిఙానికి క్రీడా నేపథ్యపు సినిమాల లైన్ ఒకేలా వుండొచ్చు కానీ వాటి మధ్య ఫిల్లింగ్ అలాగే బలమైన సీన్లు పడితే సినిమా కొత్తగా వుంటుంది.
పార్థు (నాగశౌర్య) చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోతాడు. తండ్రికి ఇష్టమైన విలువిద్య ను నేర్చుకుని అందులో చాంపియన్ కావాలనుకుంటాడు. పార్దు తాత(సచిన్ ఖేక్కర్) అందుకోసం ఊరు వదిలి పట్నం వచ్చేస్తాడు. పార్దును చాంపియన్ చేయడం కోసం ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వస్తుంది. పార్ధు కూడా చాంపియన్ గా ఎదుగుతాడు. కానీ అదే సమయంలో తాత మరణిస్తాడు. దానికి తోడు తోటి చాంపియన్ గా వున్న రాహుల్ (శతృు) కుట్రతో పార్ధు డ్రగ్స్ కు బానిస అవుతాడు. దాంతో ఆటకు దూరం అవుతాడు. ప్రేమించిన ప్రియురాలికి (కేతికశర్మ) దూరం అవుతాడు. అలాంటి టైమ్ లో ఆదుకుంటాడు పార్ధసారధి (ఙగపతి బాబు). మళ్లీ పార్ధును విల్లు పట్టుకునేలా చేస్తాడు. అప్పుడేం ఙరిగి వుంటుంది అన్నది అందరూ ఊహించేదే.
లక్ష్య సినిమా మరీ అమెచ్యూర్ సినిమాగా వుంటుంది. ఒక్క సీన్ కూడా కొత్తగా కనిపించదు. అనిపించదు. అదే సమయంలో నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగా వుంటాయి. పట్టుమని పది మంది నటులు వుండరు. ఒకరిద్దరని పక్కన పెడితే మిగిలినవారంతా అర కొర నటులే. అసలే ఒక్క సినిమా అనుభవం వున్న దర్శకుడు (సంతోష్). దానికి తొోడు ఎక్కడిక్కడ చుట్టేసే వ్యవహారం. ఈ రెండూ కలిసి సినిమాను మరీ చీప్ చేసేసాయి.
తాత మనవళ్ల ఎమోషన్ సినిమాకు కీలకం అయినపుడు దాన్ని అద్భుతంగా పండిస్తేనే సినిమా రక్తి కడుతుంది. పైగా విలువిద్య మీద సినిమా తీస్తున్నపుడు దాన్ని ఆసక్తిగా చూపించాల్సిన అవసరం వుంది. సర్.సర్ అంటూ బాణాలు వేసేయడం అయితే రెడ్ డాట్ లో లేదా ఎల్లో డాట్ లో తగలడం. అంతకు మించిన ఉత్కంఠ లేదు. ఉత్సాహం..ఆసక్తి అంతకన్నా లేవు.
సినిమాలో అంతా కట్టె కొట్టె తెచ్చే అన్నట్లు చెప్పే ప్రయత్నమే తప్ప, ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనే మూమెంట్ ఒక్కటి కూడా వుండదు. సినిమాలో ఏ సీన్ అయినా కూడా బాగా నలిగిపోయి, నడిచేసిన దారిలాగే వుంటాయి తప్ప కొత్తదనం అన్నది కలికంలోకి కూడా కనిపించదు. అసలు హీరోయిన్ ట్రాక్ మొత్తం అలాగే సాగుతుంది. విడిపోవడం అలాగే వుంటుంది. కలవడం అలాగే వుంటుంది.
హీరోకి తగిన విలన్ ను కూడా సెట్ చేసుకోలేకపోయారు. అక్కడ కూడా బడ్ఙెట్ చూసుకున్నట్లుంది. హీరో బాటిళ్లకు బాటిళ్లు ఎత్తి దింపేస్తూ వుంటే, పాపం, హీరో బాధల్లో వున్నాడ్రా అని ప్రేక్షకుడు అనుకోవాలి తప్ప, సీన్లో బలం, బాధ రెండూ కనిపించవు. సినిమా మొత్తం మీద చెప్పుకోవాలి అంటే ఎన్నో యుద్దాలు చూసిన వారికి, పిల్లలు డిష్యుం..డిష్యుం అంటూ సరదాగా డూబ్ పైట్ చేసుకుంటే ఎలా వుంటుందో ఈ సినిమా కూడా అలాగే వుంటుంది. కాస్సేపు తెరకేసి, ఎక్కువ సేపు ఫోన్ లోకి చూసుకునే అవకాశం ఇచ్చే సినిమాగా మిగిలిపోతుంది.
హీరోగా నాగశౌర్య బాగానే చేసాడు. సిక్స్ ప్యాక్ లుక్ లో బాగున్నాడు. కేతిక శర్మ రొమాంటిక్ హీరోయిన్ ఈమేనా అన్నట్లు వుంది. గెటప్ కానీ, డ్రెస్సింగ్ స్టయిల్ కానీ ఏ సీన్ కు ఆ సీన్ ఏదో కానిచ్చేసారు. ఙగపతిబాబు కాస్త ఓవర్ చేసినట్లు అనిపించింది. మిగిలిన వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని క్యారెక్టర్లకు అయితే ఇంకెవరు దొరకలేదా ఆ బడ్ఙెట్ కు అన్నట్లు తీసేసుకున్నారు.
సినిమాటోగ్రఫీ పెద్ద గొప్పగా లేదు. గ్రాఫిక్స్ చీప్ గా వున్నాయి. నేపథ్యసంగీతం ఓకె.
ప్లస్ పాయింట్లు:
హీరో
మైనస్ పాయింట్లు:
చాలానే వున్నాయి.
ఫినిషింగ్ టచ్: విల్లు విరిగిపోయింది
Rating: 2/5
Gulte Telugu Telugu Political and Movie News Updates