Movie Reviews

సమీక్ష – వరుడు కావలెను

అమ్మాయి-అబ్బాయిల నడుమ ప్రేమ..పెళ్లి.. కాన్ ఫ్లిక్ట్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ నే. సరైన సన్నివేశాలు రాసుకోగలగాలే కానీ చూడముచ్చటగానే వుంది. ఆనంద్ సినిమా నుంచి ఫిదా వరకు ఇలాంటి జోనర్ సినిమాలే. ఈవారం విడుదలయిన వరుడు కావలెను కూడా ఇంచుమించు ఇదే తరహా. హీరో హీరోయిన్ కూర్చుని రెండు నిమషాలు ప్రశాంతంగా మాట్లాడుకంటే ఇట్టే అయిపోయే కథ. కానీ ఇరు వైపుల అభిప్రాయాలను మబ్బులో వుంచుతూ కథను రెండు గంటలకు పైగా లాగడం అన్నది సినిమాటిక్ టెక్నిక్.

అసలు అలా తయారు చేసిన వరుడు కావలెను కథేంటంటే…ఓ స్టార్ట్ అప్ కంపెనీ నడుపుతూ వుంటుంది భూమి (రీతూ వర్మ). ఆమెకు పెళ్లి చూపులు నచ్చవు. పెళ్లి కొడుకులు నచ్చరు. ఆఫీసులో పరమ స్ట్రిక్ట్ గా వుంటుంది. ఇంకా ఇలాంటి చిత్రమైన క్వాలిటీలు చాలా వుంటాయి. ఆమె తల్లి (నదియా) మాత్రం పెళ్లి చేయాలని నానా ప్రయత్నాలు చేస్తుంటుంది. విదేశాల నుంచి వచ్చి ఆమె కంపెనీకి ఆర్కిటెక్ట్ గా సలహాలు అందిస్తుంటాడు ఆకాష్ (నాగశౌర్య). వచ్చిన దగ్గర నుంచి భూమిని తనవైపు తిప్పుకోవాలని చూస్తుంటాడు. కానీ ఫలితం వుండదు. ఇలాంటి నేపథ్యంలో అసలు సంగతి ఏమిటి అన్నది తెలుస్తుంది. ఆ అసలు సంగతి ఏమిటి? భూమి-ఆకాష్ లు కలిసాయా లేదా అన్నది మిగిలిన సినిమా.

వరుడు కావలెను సినిమాకు సమస్య థిన్ లైన్ స్టోరీ. అందులోనూ బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం. తను ప్రేమించిన వాడు ప్రేమ మీద ఇష్టం లేక వెళ్లిపోతే ఆ అమ్మాయి ఓ తరహా మొండితనం, కఠినత్వం అలవాటు చేసేసుకుంటుంది. తీరా మళ్లీ ఆ అబ్బాయి వచ్చిన తరువాత, తను కూడా ప్రేమలో పడిన తరువాత కూడా చిన్న పాయింట్ దగ్గర సమస్యను జటిలం చేసుకుంటుంది. ఈ చిక్కుముడి ఎంత బలంగా వుంటే దాని చుట్టూ రాసుకునే సీన్లు కాస్త అటు ఇటుగా వున్నా వ్యవహారం నడిచిపోతుంది. అలా కాకుండా బలమైన అపార్థాలు లేదా బలమైన సంఘటనలు లేకుండా, కేవలం సన్నివేశాలతోటే పని జరిపించేయాలి అనుకుంటే కష్టం.

వరుడు కావలెను సినిమా సమస్య ఇదే. సినిమా తొలిసగం ఎంత ముందుకు వెళ్తున్నా అక్కడికక్కడే తిరుగుతున్నట్లు వుంటుంది. హీరోయిన్ సీన్లు, ఆమె తల్లి సీన్లు రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఇలాంటి సినిమాలో కొంత లవ్ రొమాన్స్ వుండి ఆపైన ఎడమొహం పెడమొహం వుంటే ఆ మజా వేరు. టోటల్ గా సినిమా అంతా ఎడమొహం పెడమొహంగా వుంటే ప్రేక్షకుడికి మజా ఎక్కడి నుంచి వస్తుంది. అప్పటికీ డ్రీమ్ సాంగ్స్ ప్లాన్ చేసి కాస్త సేవింగ్ గ్రేస్ అనిపించుకున్నారు. కానీ ఎంతయినా తొలిసగం బాగా నత్త నడక అనిపించుకుంటుంది.

సినిమా తొలిసగం అంతా నాగార్జున మన్మధుడు చూస్తున్నట్లు అనిపిస్తుంది. నాగార్జున బదులు రీతూవర్మ. ఆఫీస్ సెటప్. అక్కడ స్టాఫ్. హీరోయిన్ క్రమశిక్షణ పాఠాలు ఇవన్నీ ఆ సినిమానే గుర్తు చేస్తాయి. నిజానికి అనుకున్న ప్రేమ దొరక్కపోతే అలా ఎందుకు మారిపోవడమో? అన్నది లాజిక్ కు అందదు. మన్మధుడు సినిమాలో అమ్మాయి మోసం చేసింది కు అమ్మాయిలు అంటే విముఖత వుంటుంది. ఇక్కడ వ్యవహారాలు లాజిక్ కు అందవు. సరే, ఆ సంగతి అలా వుంచితే అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టమే, కానీ ఫ్లాష్ బ్యాక్ కారణంగా ఇలా వుంది అని చెప్పిన తరువాత ఇక సినిమా బిగుతుగా ముందుకు వెళ్తుంది అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చి పడుతుంది. అది అలా అలా అరకొరగా ముగించేసారు. అక్కడ కూడా బలమైన రీజన్ చూపించలేకపోయారు. జస్ట్ ఓ డైలాగుతో అమ్మాయి మనసు మార్చేసుకుంటుంది.

ప్రథమార్థంతో పోల్చుకుంటే ద్వితీయార్థం బెటర్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా సప్తగిరి, సాయి ల కామెడీ ఎపిసోడ్ పండింది. ఒకరు ఓవర్ స్పీడ్, మరొకరు టూ మచ్ స్లో. ఈ భిన్న మైన కామెడీ సినిమాలో అక్కడ అక్కడా వుంటే అది వేరుగా వుండేది. అయితే సినిమాను నిలబెట్టింది మాత్రం ఈ కామెడీ ఎపిసోడ్ మాత్రమే. ఆ తరువాత క్లయిమాక్స్ చకచకా ఊడిపడుతుంది.

కథ, కథనాల పరంగా సమస్యలు వున్నా సినిమాను నిలబెట్టిన అంశాలు చాలా వున్నాయి. ఒకటి కలర్ ఫుల్ చిత్రీకరణ. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరక్షన్, దర్శకుడరాలి విజన్ అన్నీ కలిసి సినిమాను ఓ విజువల్ ట్రీట్ గా మార్చాయి. రెండవది పాటలు. మూడు పాటలు బాగున్నాయి. నేపథ్యసంగీతం బాగుంది. సన్నివేశాలు సాదా సీదా అయినా వాటిని మరింత బలంగా మార్చేందుకు సంగీత దర్శకుడు గట్టిగా కృషి చేసాడు. హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు.

ఇలా ప్రతి ప్రేమ్ బాగుండడం, తొలి భాగంలో వెన్నెల కిషోర్, మలి భాగంలో సప్తగిరి, సాయి కలిసి సినిమాను బాగుంది అనే స్థాయికి తీసుకువచ్చారు. సినిమాలో సంభాషణల విషయంలో ప్రాసల కోసం కాస్త ఎక్కువే ప్రయాసపడ్డారు. కొన్ని చోట్ల డైలాగులు బాగున్నాయి అన్న టాక్ తెచ్చుకున్నారు. బేసిక్ గా కథ లో బలం లేకపోవడం వల్ల అంతకు మించి చేయలేకపోయారు.

హీరో నాగశౌర్య అందంగా వున్నాడు. పాత్రకు తగినట్లు తూకం వేసి చేసాడు. రీతూ వర్మ ఓకె. సప్తగిరికి చాలా రోజుల తరువాత మంచి పాత్ర పడింది. కానీ నిడివి మరికాస్త వుంటే బాగుండేది. టెక్నికల్ గా సినిమా బలంగా వుంది. ఖర్చు కనిపిస్తోంది.

మొత్తం మీద చూసుకుంటే డిస్సపాయింట్ చేసే సినిమా కాదు. క్లీన్ గా ఫ్యామిలీతో చూడగలిగే సినిమానే వరుడు కావలెను.

ప్లస్ పాయింట్లు
పాటలు,
మాటలు
నేపథ్యసంగీతం
సెకండాఫ్ లో కామెడీ

మైనస్ పాయింట్లు
బలమైన కథ లేకపోవడం
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

ఫినిషింగ్ టచ్: కథ కావలెను

Rating: 2.75/5

This post was last modified on October 29, 2021 5:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago