2.5/5
150 minutes | Action-Romance | 14-10-2021
Cast - Sharwanand, Siddharth, Aditi Rao, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh and Others
Director - Ajay Bhupathi
Producer - Rambrahmam Sunkara
Banner - AK Entertainments
Music - Chaitan Bharadwaj
సినిమాకు ఎన్ని హంగులైనా చేర్చవచ్చు. కానీ అసలైన బలాన్ని చేకూర్చేది కథ మాత్రమే. సరైన కథ లేకుండా కేవలం బిల్డప్ లతో బండి లాగించేద్దాం అనుకుంటే వ్యవహారం నడవదు. ఈవారం విడుదలైన మహా సముద్రం కూడా అంతే. కథ తక్కువ, బిల్డప్పులు ఎక్కువ. అసలు విషయం తక్కువ నెరేషన్ లో టెక్నికల్ క్వాలిటీ మీద దృష్టి ఎక్కువ. కానీ ప్రేక్షకుడికి కూర్చొపెట్టేది కథ మాత్రమే. కథ తో కనెక్ట్ అయితే సీన్లు పండినట్లు వుంటాయి. అప్పుడు ప్రేక్షకుడు సినిమాలో లీనం అవుతాడు. లేదూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు వుంటుంది వ్యవహారం.
ఇంతకీ ఈ మహాసముద్రం కథేంటీ అంటే విజయ్ (సిద్దార్థ), అర్జున్ (శర్వానంద్) స్నేహితులు. పోలీస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు విజయ్. మరోపక్క మహా (అదితి రావ్) తో స్నేహం. ఇలాంటి టైమ్ లో ఓ హత్య కేసులో ఇరుక్కుని, ఊరు విడిచి పారిపోతాడు విజయ్. అదే టైమ్ లో మహా ను కావాలని వదిలించుకుంటాడు. ఆ తరువాత మహాను చేరదీసి ఆశ్రయం ఇస్తాడు అర్జున్. ఆమెకు ఓ కూతురు పుడుతుంది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ గా మారతాడు అర్జున్. ఇలాంటి టైమ్ లో విజయ్ తిరిగి వస్తాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన కథ.
సినిమా తొలిసగం మొత్తం పాత్రల బిల్డప్ కు, పరిచయానికే సరిపోతుంది. ఇద్దరు హీరోలు, హీరోయిన్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ (అను ఇమ్మాన్యుయేల్), గూని బాబ్జీ (రావు రమేష్), చుంచు మామ (జగపతి బాబు) లాంటి బోలెడు క్యారెక్టర్లు వున్నాయి. వీటన్నింటికీ కూడా చాలా బిల్డప్పులు కూడా. అసలు బిల్డప్ లతోనే తొలిసగం మొత్తం సరిపోతుంది. ఒక్కో పాత్రను పరిచయం చేయడం, దానికి మానరిజమ్స్, దాని వ్యవహారం ఇలా నడపుకుంటూ వచ్చి, విశ్రాంతికి ముందు లాక్ వేసినట్లే వేసి మళ్లీ మరో పది నిమషాలు పొడిగించి అప్పుడు బయటకు పదండి అంటాడు దర్శకుడు.
ద్వితీయార్థం మొదలైన తరువాత ఇక నడపడానికి ఏమీ వుండదు. అప్పటి వరకు బిల్డప్ లు ఇచ్చిన పాత్రలు అన్నీ ఒక్కోటీ నీరసించిపోతాయి. ఒక హీరో కనిపంచడు. ఒక హీరోయిన్ కూడా గాయబ్. ఇంకో హీరోయిన్ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటుంది. చుంచుమామ, గూని బాబ్జీలు హడావుడి ఎక్కువ, అసలు తక్కువ అన్నట్లు కనిపిస్తుంటారు. హీరో మరోసారి రణరంగం సినిమా చూపిస్తుంటాడు.
తీరా చేసి రెండో హీరో సినిమాటిక్ గా రంగంలోకి దిగాక, సినిమా 1985 కాలానికి వెళ్లిపోయి, సినిమాటిక్ సెంటి మెంట్లు ప్రవేశిస్తాయి. వాటి మధ్యలో అస్సలు అతకని ఓ అయిటమ్ సాంగ్, పనిలో పనిగా అప్పటి వరకు ఏడుస్తూ కూర్చున్న హీరోయిన్ అందాల ఆరబోత సాంగ్. జనాలు సినిమా చూడడం మానేసి ఫోన్ లు చూసుకోవడం ప్రారంభమైపోతుంది అప్పటికే.
ఇలాంటి సినిమా కోసం భయంకరంగా ఖర్చు పెట్టేసారు. దాంతో విజువల్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. అలాగే మాటలు కూడా బాగున్నాయి. అసలు విషయం లేక, సీన్లలో బలం లేక జనం వాటిని అస్సలు పరిగణనలోకి తీసుకునే వీలు లేకుండా పోయింది.
హీరో శర్వానంద్ అర్జంట్ గా మారాలి. ఇప్పటికే మూడు నాలుగు సినిమాల నుంచి అవే లుక్స్, అదే శాడ్ అండ్ సీరియస్ ఫేస్. అస్సలు కొత్త సినిమా చూస్తున్నట్లు లేదు అతగాడిని చూస్తుంటే. సిద్దార్ధ ఓకె,. అనుఇమ్మాన్యయేల్ కు వున్న క్యారెక్టర్ నే తక్కువ. అదితికి క్యారెక్టర్ వుంది కానీ దానికి తగ్గ బలమైన సీన్లు లేవు. రొటీన్, లైట్ సీన్లే అన్నీ. జగపతిబాబు బాగా చేసాడు. రావు రమేష్ కూడా.
ఆర్ఎక్స్ 100 లాంటి భిన్నమైన సినిమా అందించి భావోద్వేగాలు తెరపైకి తేగలడంలో దిట్ట అనుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ఈసారి ఆ ప్రయత్నం చేసాడు కానీ, సరైన కథ లేక, సన్నివేశాలు అల్లిక సరిగ్గా లేక, జనం అస్సలు కనెక్ట్ కాలేదు. అంత డబ్బు పెట్టే నిర్మాత, అంత మంది నటులు సమకూరినపుడు తను అనుకన్న కథను, స్క్రీన్ ప్లేను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వుండాల్సింది. అలా చేయలేదు. అందుకే సినిమా ఫెయిల్ అయింది.
ప్లస్ పాయింట్లు
డైలాగులు
ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు
మలి సగం
సరైన కథ లేకపోవడం
ఫినిషింగ్ టచ్: డెడ్ సీ
Rating: 2.5/5
Gulte Telugu Telugu Political and Movie News Updates