Movie News

క్యామియోలతో నిండిపోతున్న కూలీ

సౌత్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. కథలు కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే, హీరోయిజం ఎలివేషన్లతో ఇప్పటి ట్రెండ్ కి నచ్చేలా సినిమాలు తీయడం యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. లియోకి అంత భారీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ రావడానికి విజయ్ ఇమేజ్ కన్నా ఎక్కువ పని చేసింది లోకేష్ బ్రాండే. గోట్ కు ఓపెనింగ్స్ తక్కువ రావడానికి కారణం ఇదే. ప్రస్తుతం రజనీకాంత్ తో తను కూలి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ మాఫియా డ్రామా నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్.

ఇందులో నాగార్జున, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత నిడివి అనేది బయటికి రాలేదు కానీ చాలా ప్రాధాన్యం ఉందని తెలిసింది. విక్రమ్ లో రోలెక్స్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అంతకన్నా ఎక్కువే వీటిని డిజైన్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు వీళ్ళు చాలదు అన్నట్టు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని సైతం తీసుకొస్తున్నాడట. అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ దాదాపు ఖాయమైనట్టు చెన్నై టాక్. ఇదే నిజమైతే కూలి హిందీ మార్కెట్ కు బూస్ట్ దొరికినట్టే. రజని సోలో హీరోగా చేసినవాటిని నార్త్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. జైలర్, వేట్టయన్ లే ఉదాహరణ.

చూస్తుంటే లోకేష్ కనగరాజ్ మరీ ఎక్కువగా క్యామియోల మీద ఆధారపడుతున్నాడేమో అని అనుమానం రాకమానదు. సినిమాటిక్ యునివర్స్ పేరుతో ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ లను కలుపుతూ ఒక మల్టీస్టారర్ తీస్తానని, ఎవరూ ఊహించని అంశాలు అందులో ఉంటాయని ఊరిస్తున్నాడు. కూలి మాత్రం స్టాండ్ అలోన్ మూవీ ఆట. ఖైదీ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. ఇంకో మూడు సంవత్సరాలు లోకేష్ పూర్తిగా వీటికే టైం కేటాయించబోతున్నాడు. తెలుగులో స్టార్ హీరోలు తనతో పని చేసేందుకు మొగ్గు చూపుతున్నప్పటికీ ఇప్పట్లో అతని టాలీవుడ్ డెబ్యూ జరగని పని. 

This post was last modified on October 14, 2024 1:10 am

Share

Recent Posts

ఎపిక్ మీద A ప్రభావం నిజంగా ఉంటుందా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీద యూత్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ…

47 minutes ago

కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర హై టెన్షన్

తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం…

48 minutes ago

ఇన్‌స్టాగ్రామ్ ఏం చూపించాలో ఇక మనమే చెప్పొచ్చా?

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనం ఫాలో కాని అకౌంట్ల నుంచి కూడా వరుసగా రీల్స్ వచ్చేస్తుంటాయి. ఒక వీడియో కాస్త…

55 minutes ago

చిరు vs ఎన్టీఆర్ ఫాన్స్ వార్లు… సహించని హై కమాండ్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…

2 hours ago

ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది అదొక్కటే

వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…

3 hours ago

ప్యాన్ సౌత్ సినిమా… చాలా మంచి మాట ఇది

ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…

3 hours ago