ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను హీరోల అభిమానుల కోసం రీ రిలీజ్ చేయడం.. వాటిని వాళ్లు సెలబ్రేట్ చేయడం తెలుగులో రెండేళ్లుగా నడుస్తున్న ట్రెండు. దీన్ని వేరే భాషల వాళ్లు కూడా అందిపుచ్చుకోవాలని చూశారు కానీ.. ఈ రేంజిలో అక్కడ రెస్పాన్స్ లేదు. తమిళంలో కొంత మేర ఇది వర్కవుట్ అయింది. హిందీలో ఈ ట్రెండ్ అసలే లేదు. కానీ ‘తుంబాడ్’ అనే సూపర్ నేచురల్ మూవీని ఇటీవల రిలీజ్ చేస్తే దానికి ఎవ్వరూ ఊహించని స్పందన వచ్చింది.
2018లో రిలీజైన ఈ చిత్రానికి అప్పట్లో ఓ మోస్తరు ఫలితమే వచ్చింది. సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఓటీటీలో జనం దీన్ని బాగానే చూశారు. కాల క్రమంలో ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతే ఓటీటీలో చూసిన చాలామంది ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని ఫీలయ్యారు.
ఆ ఫీడ్ బ్యాక్ మేకర్స్ వరకు చేరి.. రీ రిలీజ్‌ను చక్కగా ప్లాన్ చేసి సినిమాను వదిలారు. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం చేసిన మ్యాజిక్ ట్రేడ్ పండిట్లకు షాక్. తొలి వారంలోనే రూ.13.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. నెల రోజుల పాటు రన్ కొనసాగించింది. ఇప్పటిదాకా ఏకంగా రూ.35 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. మూడు నాలుగు వారాల్లో కలిపి ఆరు కోట్ల వసూళ్లు రావడం అంటే మాటలు కాదు.
ఫస్ట్ రిలీజ్‌లో వచ్చిన ఓవరాల్ వసూళ్లతో పోలిస్తే ఇప్పటి మొత్తం కలెక్షన్లు మూడు రెట్లు కావడం విశేషం. ఇండియాలో రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేసింది. తుంబాడ్-2 తీయాలని సన్నాహాలు మొదలుపెడుతున్న టైంలో రీ రిలీజ్ టీంకు ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. తమకు ఈ విజయం మంచి కిక్ ఇచ్చిందని.. ప్రస్తుతం తుంబాడ్-2 స్క్రిప్టు, ప్రి ప్రొడక్షణ్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్తామని ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సోహుమ్ షా తెలిపాడు. పార్ట్-2కు బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 14, 2024 10:22 am
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…