వచ్చే ఏడాది కోసం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు గట్టిగానే సిద్దమవుతున్నాయి. వాటిలో వార్ 2 – కాంతార ప్రీక్వెల్ చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి గర్వకారణమైన కాంతార ప్రీక్వెల్ తో అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2పై అంచనాలు మాములుగా లేవు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక కాంతార ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 కోసం భారీగా 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2025 ఆగస్టులో మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో పాపులర్ కాగా ఈసారి ఎన్టీఆర్ కలవడంతో సౌత్ ఇండియాలో కూడా హైప్ క్రియేట్ అవుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే టైమ్ లో విడుదల కావడం వలన ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి టార్గెట్ అయితే ఒక్కటే. వీలైనంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని అనుకుంటున్నాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
This post was last modified on October 14, 2024 12:17 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…