కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మార్కెట్ పెంచుకునే పనిలో తెలివిగా అడుగులు వేస్తున్న నాని నిర్ణయాలు ఎంత బాగున్నాయో ఇవాళ విడుదలైన వేట్టయన్ మరోసారి ఋజువు చేసింది. దీనికి న్యాచురల్ స్టార్ నానికి కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. రజనీకాంత్ ఈ స్టోరీని ఓకే చేశాక టీజె జ్ఞానవేల్ క్యాస్టింగ్ లో మొదట పెట్టుకున్న ప్రాధాన్యతలో నాని పేరు ఉంది. ఆ మేరకు కలిసి కథ కూడా చెప్పాడు.
ఫాహద్ ఫాసిల్ పోషించిన దొంగ కం ఇంఫార్మర్ పాత్ర లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న దగ్గుబాటి రానా క్యారెక్టర్ రెండింట్లో ఒకటి ఆఫర్ చేశాడట. అయితే నాని సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. రజనికాంత్, అమితాబ్ లాంటి లెజెండ్స్ ఉన్న సినిమా అయినా సరే తనకు దక్కే ప్రాధాన్యం చూసుకుని నో చెప్పాడు. ఇప్పుడదే కరెక్టని రుజువయ్యియింది.
వేట్టయన్ లో రానా, ఫహద్ ఇద్దరూ కీలకమే అయినప్పటికీ ఇమేజ్ పరంగా చూసుకుంటే నాని చేయకపోవడమే ఉత్తమం. దీని వల్ల కలిగే ప్రయోజనం తక్కువే. ఉన్నంతలో ఫహద్ వేసిన బ్యాటరీ పాత్రలో ఫన్ ఉన్నప్పటికీ అది నాని రేంజ్ అయితే ఖచ్చితంగా కాదు. ఇవన్నీ లెక్క వేసుకునే నాని వద్దని చెప్పి ఉండొచ్చు. జ్ఞానవేల్ తనను కలిసింది, వద్దన్నది ఏదీ అధికారికంగా బయటికి రాలేదు. అంతా లీక్స్ దశలోనే ఆగిపోయింది.
ఒకవేళ నాని కనక వేట్టయన్ చేసి ఉంటే మార్కెట్ పరంగా మరింత వెయిట్ రావడంతో పాటు బిజినెస్ లెక్కలు మారేవి. దసరా ఇచ్చిన బ్లాక్ బస్టర్ వల్ల ఆచితూచి అడుగులు వేస్తూ ఇటీవలే సరిపోదా శనివారంతో మరో వంద కోట్ల గ్రాసర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఎల్లుండి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో ప్యాన్ ఇండియా మూవీని గ్రాండ్ గా ప్రారంభించబోతున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ వచ్చే ఏడాది విడుదల కానుండగా ఇకపై సంవత్సరానికి ఒకటే రిలీజ్ చేయాల్సి వచ్చినా సరే రాజీపడే ఉద్దేశంలో కనిపించడం లేదు. క్యాన్సిల్ అనుకున్న దర్శకుడు సుజిత్ ప్రాజెక్టు తర్వాతైనా తీస్తారనే టాక్ ఉంది.
This post was last modified on October 11, 2024 10:26 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…