అధికారిక ప్రకటన లేదన్న మాటే కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి, విశ్వంభర వేసవికి వాయిదా పడినట్టేనని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరి దూరంలో ఉన్నా థియేటర్లను అగ్రిమెంట్ చేసుకునే వ్యవహారాలు రెండు మూడు నెలల ముందే మొదలవుతాయి. దిల్ రాజు తన సర్కిల్లో ఉన్న బయ్యర్లకు ఎస్విసి బ్యానర్ లో రూపొందుతున్న రామ్ చరణ్, వెంకటేష్ సినిమాలు పండక్కి వస్తాయని, ఆ మేరకు ఏర్పాట్లలో ఉండమని చూచాయగా చెప్పారట.
వీలైతే దసరాకు అనౌన్స్ మెంట్లు వస్తాయని లేదా ఒకటి రెండు వారాల్లో ఆ లాంఛనం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నట్టు వినికిడి. సరే గేమ్ ఛేంజర్ కు మంచి సీజన్ దొరికిందని ఫ్యాన్స్ సంబరపడ్డా అసలు ఛాలెంజ్ విశ్వంభరకు ఉంటుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ విజువల్ వండర్ కు వీలైనంత సోలో డేట్ కావాలి. మార్చి చివరి వారం దానికి అనుకూలంగా ఉంటుంది. అయితే హరిహర వీరమల్లు ఆల్రెడీ అఫీషియల్ గా డేట్ లాక్ చేసుకుని కొన్ని వారాల క్రితమే పోస్టర్ వదిలింది.
గతంలో విజయ్ దేవరకొండ 12 కూడా ఇదే తేదీని అధికారికంగా ప్రకటించుకుంది. పవన్ వస్తున్నాడు కాబట్టి VD12 వాయిదా వేస్తారు. మరి విశ్వంభర ఏం చేస్తాడన్నది అసలు ట్విస్టు. ఇక్కడో ప్రీ ప్లాన్ ఉన్నట్టు అంతర్గత సమాచారం. ఒకవేళ మళ్ళీ ఏదైనా కారణాల వల్ల హరిహర వీరమల్లు కనక వెనుకడుగు వేస్తే ఆ స్లాట్ ని వెంటనే విశ్వంభర లాక్ చేసుకుంటాడు. అంటే తమ్ముడు స్థానంలో అన్నయ్య అన్న మాట. కానీ నిర్మాత ఏఎం రత్నం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఇప్పటికే విపరీతమైన జాప్యం, వాయిదాలతో ఆర్థికంగానూ చాలా బరువును మోస్తున్నారు. ఇది అర్థం చేసుకునే పవన్ కళ్యాణ్ ఓజిని కాదని వీరమల్లుకి డేట్లు ఇచ్చారు. సో విశ్వంభర ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి రావొచ్చు. అదే జరిగిన పక్షం ఏప్రిల్ లేదా జూన్ ఈ రెండు నెలల్లో ఒక మంచి టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు చెప్పేదాకా ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.
This post was last modified on October 11, 2024 12:00 pm
ఇటీవల ఓ చర్చా వేదికలో హిందీ సినిమాల మీద తెలుగు చిత్రాల ఆధిపత్యం గురించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ…
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు…
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.…
హైదరాబాద్ వాసులకు.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం 2025 సందర్భంగా శుభాకాంక్షలతో పాటు కానుకను కూడా అందించారు. హైదరాబాద్…
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రయాణం చేయనున్నారు. ఏపీలో ఆయన…
సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు…