టాలీవుడ్లో నంబర్ల గేమ్ గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అభిమానులు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తెగ కొట్టేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో అనే విషయంలో చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. తమ హీరో నంబర్ వన్ అంటే తమ హీరో నంబర్ వన్ అని ఫ్యాన్స్ గొడవ పడుతుంటారు. ఈ విషయంలో అగ్ర నిర్మాత సురేష్ బాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నంబర్ల గేమ్ గురించి ఆయన మాట్లాడారు.
“ఎవరు బిగ్గెస్ట్ స్టార్ అనే విషయంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. టాప్ స్టార్లలో ప్రతి హీరోకూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కలెక్షన్లు దర్శకుడి మీద కూడా ఆధారపడి ఉ:టాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవచ్చు. అందుకే కలెక్షన్ల ఆధారంగా ఎవరు పెద్ద హీరో అనేది నిర్ణయించలేం.
తెలుగులో పవన్ కళ్యాణ్‌కు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ప్రభాస్ సినిమాలకు కూడా ఇప్పుడు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా ఇలాగే మంచి స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ దేశంలోనే పెద్ద హీరోనా అంటే చెప్పలేం. బాహుబలి, సలార్ మధ్యలో అతను నటించిన కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేదు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్‌కు అత్యధిక ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న దర్శకులతో సినిమా తీసినా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలా అని ఏ సినిమా తీసినా చూస్తారని అనుకోకూడదు. ఎందుకంటే గతంలో ఆయన్నుంచి వచ్చిన ‘జానీ’ పూర్తిగా ఫెయిలైంది.
తెలుగులో వంద కోట్ల వసూళ్లు సాధించే హీరోలు చాలా మంది ఉన్నారు. ఇదే చర్చ కోలీవుడ్లోనూ ఉంటుంది. అజిత్, విజయ్, రజినీకాంత్‌లలో ఎవరు పెద్ద హీరో అనేది చెప్పలేం. ఐతే ఈ స్టార్లు సినిమాలు ఆపేస్తే ఏమవుతుందో అని కంగారు పడుతుంటారు. కానీ అంతటితో ఇండస్ట్రీ ఆగిపోదు. సూపర్ స్టార్లు సినిమాలు ఆపేస్తే లోకల్ హీరోలే స్టార్లుగా మారతారు’’ అని సురేష్ బాబు అన్నారు.
This post was last modified on October 4, 2024 2:15 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…