Movie News

మనం నెత్తిన పెట్టుకుంటాం.. మరి తమిళులు?

తమిళం నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా వచ్చినా తెలుగులో మంచి రిలీజ్ ఉంటుంది. థియేటర్ల సమస్య ఉండదు. ప్రేక్షకాదరణ కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌ మొదలుకుని.. శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోల వరకు ఎంతోమందిని మన వాళ్లు ఆదరించారు. వాళ్ల సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు.

ఇటీవల విజయ్ సినిమా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెలుగులో ఎంత పెద్ద రిలీజ్ దక్కిందో తెలిసిందే. దానికి అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు షోలు పడ్డాయి. మనవాళ్లు తమిళ చిత్రాలను ఇంతగా నెత్తిన పెట్టుకుంటుంటే.. తమిళులు మన చిత్రాలను ఎలా చూస్తున్నారన్నది చర్చనీయాంశం. ప్రేక్షకాదరణ దక్కాలంటే ముందు మంచి రిలీజ్ ఉండాలి. థియేటర్ల కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉండాలి. కానీ ఈ విషయంలో అక్కడి ఎగ్జిబిటర్ల నుంచి సహకారం లభించదు.

రాజమౌళి, ప్రభాస్ సినిమాలను పక్కన పెడితే.. వేరే చిత్రాలకు తమిళనాట థియేటర్లు దొరకడం చాలా కష్టం. ‘దేవర’ సినిమాకు తమిళనాట మంచి బజ్ ఉన్నప్పటికీ థియేటర్ల సమస్య తప్పట్లేదన్నది తాజా సమాచారం. ఈ వారం కార్తి మూవీ ‘మెయ్యళగన్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అదేమీ భారీ చిత్రం కాదు. హైప్ మరీ ఎక్కువేమీ లేదు. దాంతో పాటుగా ‘దేవర’కు రీజనబుల్ రేంజిలో థియేటర్లు ఇవ్వచ్చు. కానీ ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లు అసలే ఇవ్వట్లేదు. మల్టీప్లెక్సుల్లో కూడా ఆశించిన స్థాయిలో స్క్రీన్ల, షోలు లభించట్లేదట.

సినిమాకు హైప్ ఉన్నప్పటికీ థియేటర్లు చాలినంత స్థాయిలో దక్కకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడుతున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. అదే సమయంలో కార్తి చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఏషియన్ మూవీస్ సునీల్ రిలీజ్ చేస్తుండడం వల్ల దానికి స్క్రీన్లు షోల విషయంలో ఇబ్బంది లేదు. సినిమా బాగుంటే మనవాళ్ల ఆదరణ ఎలా ఉంటుందో కూడా చెప్పాల్సిన పని లేదు. మనం వాళ్ల సినిమాలను ఇంతగా నెత్తిన పెట్టుకున్నా.. వాళ్లు మాత్రం మన చిత్రాలకు తమిళనాట ఎదగనివ్వకపోవడం అన్యాయమే కదా.

This post was last modified on September 25, 2024 5:07 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago