మాములుగా దర్శకధీర రాజమౌళితో ఎవరైనా హీరో సినిమా ఒప్పుకుంటే వాళ్ళు బయట కనిపించడం తగ్గిపోతుంది. ఆయన అనుమతి లేనిదే కనీసం ఇంకో షూటింగ్ లో పాల్గొనలేరు. ఆర్ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్ ఆచార్య ప్రత్యేక క్యామియో చేయడానికి కొరటాల శివ, చిరంజీవి స్వయంగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక పబ్లిక్ ఈవెంట్ల సంగతి సరేసరి. కానీ మహేష్ బాబుకి మాత్రం అలాంటి కండీషన్లు పెట్టలేదు. ఆయన స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద విరాళం అందించే టైంలో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులకు మాములు గూస్ బంప్స్ రాలేదు.
ఎప్పుడూ లేనిది జక్కన్న మహేష్ కు మాత్రం ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చాడనే సందేహం రావడం సహజం. టీమ్ నుంచి వస్తున్న లీక్స్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. బయట చూస్తున్నట్టు మహేష్ లుక్ ఇది కాదట. ముందు జులపాల జుట్టు, గుబురు గెడ్డం, మీసం పెంచాక ఫైనల్ గా తనకు కావాల్సిన లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్టులను రాజమౌళి పిలిపించబోతున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్ తో ఒక ఫోటో షూట్ చేసి వాటి మీద ఫారిన్ ఎక్స్ పర్ట్స్ నాలుగైదు ఆప్షన్లతో వివిధ డిజైన్లు తయారు చేయించే పనిలో ఉన్నారట.
వాటిని విశ్లేషించుకుని ఒకటి బెస్ట్ అనిపించింది ఎంపిక చేసుకుని అప్పుడు మహేష్ ని ఆ గెటప్ లోకి తీసుకొస్తారు. అది జరిగాక బయట కనిపించడం తగ్గిపోతుంది. ఒకవేళ ఎమెర్జెన్సీ అయితే తల మీద టోపీ, మొహానికి మాస్కుతో కవర్ చేస్తారు. ఇదంతా జరగడానికి ఇంకో రెండు మూడు నెలలు టైం పట్టేలా ఉంది. అందుకే మహేష్ హ్యాపీగా తిరిగేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఫీషియల్ లాంచ్ ఎప్పుడు చేయాలనేది రాజమౌళి ఇంకా నిర్ణయించలేదట. అప్డేట్స్ కోసమైతే ఇప్పుడప్పుడే అభిమానులు ఎదురుచూడకపోవడం బెటర్.
This post was last modified on September 25, 2024 3:00 pm
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…