అల్లు అర్జున్ – సుకుమార్‌ల పుష్ప చిత్రానికి ఇంకా విలన్ ఎవరనేది ఫిక్సవలేదు. మొదట విజయ్ సేతుపతి అనుకున్నారు కానీ లాక్డౌన్ టైమ్‌లో తనకు డేట్స్ కుదరవని అతను తప్పుకున్నాడు. దాంతో నారా రోహిత్‌ను సంప్రదించారు కానీ హీరోగా మరోసారి అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలలో వున్న అతను సమ్మతం తెలుపలేదు. ఆ తర్వాత తమిళ హీరో మాధవన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.
దీనిపై పుష్ప యూనిట్ స్పందించే ముందే మాధవన్ స్పందించి ఫుల్స్టాప్ పెట్టేసాడు. సదరు న్యూస్ తాలూకు లింక్ ట్యాగ్ చేసి ‘ఇందులో కాస్త కూడా నిజం లేదు’ అని మాధవన్ పేర్కొన్నాడు. దీంతో పుష్ప విలన్ స్లాట్ ఇంకా ఓపెన్‌గానే వుంది. ఇంకా ఆ పార్ట్ ఎవరు చేయాలనేది డిసైడ్ కాలేదు కానీ పుష్పకు ముందు ఫైట్ సీన్లు తీయాలని సుకుమార్ డిసైడ్ చేసాడు.
కేరళలో నెల రోజుల పాటు రెండు భారీ ఫైట్, ఛేజ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబరులో కేరళ వెళ్లి ఈ ఫైట్ సీన్లు ముగించుకుని ఆ తర్వాత టాకీ పార్ట్ ఎక్కడ తీస్తే బెస్ట్ అనేది డిసైడ్ అవుతారట. కేరళలో కన్వీనియంట్ అనిపిస్తే చాలా వరకు షూటింగ్ అక్కడే కానిచ్చేస్తారు. కాని పక్షంలో మారేడుమిల్లి ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates