ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో బాధితులు మిగిలారు. ఈ విపత్కాల సమయంలో ప్రభుత్వాలు చక్కని చర్యలు తీసుకుంటూ ఉండగా ఇంకోవైపు టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు దాతృత్వంలో తమకు ఎవరూ సాటిరారని ఋజువు చేసుకుంటున్నారు. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైతం మనవాళ్ళు ధారాళంగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంత జరుగుతున్నా తమిళ, మలయాళ హీరోల నుంచి కనీస స్పందన సానుభూతి రూపంలో రాకపోవడం గమనార్హం.
ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్లలో పవన్ కళ్యాణ్ (6 కోట్లు), ప్రభాస్ (2 కోట్లు), చిరంజీవి (1 కోటి), బాలకృష్ణ (1 కోటి), నాగార్జున (1 కోటి), మహేష్ బాబు (1 కోటి), జూనియర్ ఎన్టీఆర్ (1 కోటి), అల్లు అర్జున్ (1 కోటి), రామ్ చరణ్ (1 కోటి), ఫిలిం ఛాంబర్ (50 లక్షలు), హారికా హాసిని (50 లక్షలు), మైత్రి మేకర్స్ (50 లక్షలు), దిల్ రాజు సంస్థ (50 లక్షలు), వైజయంతి మూవీస్ (45 లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ (30 లక్షలు), సాయి ధరమ్ తేజ్ (25 లక్షలు), తెలుగు నిర్మాతల సమాఖ్య (20 లక్షలు), వరుణ్ తేజ్ (15 లక్షలు), తెలుగు ఫిలిం ఫెడరేషన్ (10 లక్షలు), విశ్వక్ సేన్ (10 లక్షలు), వెంకీ అట్లూరి (10 లక్షలు), అంబికా కృష్ణ (10 లక్షలు), అలీ (6 లక్షలు), అనన్య నాగళ్ళ (5 లక్షలు) ఉన్నారు.
ఇంకా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అయితే ముంబై, చెన్నై, బెంగళూరు, కోచి నుంచి వచ్చి ఇక్కడ స్టార్ డం తెచ్చుకున్న కొందరు హీరోలు హీరోయిన్లు ఇంకా స్పందించనే లేదు. ఇచ్చే తీరాలన్న రూల్ లేదు కానీ ఇలాంటి సమయంలో అభిమానులు వాటిని కనీస స్థాయిలో ఆశించడం సహజం. ప్యాన్ ఇండియా ప్రమోషన్ల పేరుతో హైదరాబాద్ లో పదుల కొద్దీ ఈవెంట్లు చేసే కోలీవుడ్ హీరోల జాడే లేదు. మనం మాత్రం చెన్నై మునిగినా త్రివేండ్రం వరదలో తేలినా డబ్బులు ఇచ్చేస్తాం. అందుకే అనేది తెలుగు చిత్ర సీమకు సాటి వచ్చేవారు లేరు కనిపించరు.
This post was last modified on September 6, 2024 12:21 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…