పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోల్డ్‌లో పెట్టిన మూడు చిత్రాల్లో.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై మంచి భారీ అంచనాలున్నాయి. కానీ ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. షూటింగ్ కూడా మధ్యలో ఆగిపోయింది. ఐతే ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ ఖాయం అనే ధీమాను ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హరీష్ శంకర్ వ్యక్తం చేశాడు. పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అన్నాడు.
తాజాగా ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్ శంకర్.. ‘ఉస్తాద్’ విశేషాల గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి తరహాలో ఒక ఎపిసోడ్ ఉందని.. అది వచ్చినపుడు థియేటర్లు షేక్ అయిపోతాయని అతనన్నాడు.
‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్‌ను చాలా సినిమాల్లో అనుకరించగా అవి వర్కవుట్ కాని విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. “దబంగ్ సినిమాను గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేసినపుడు చాలా మార్పులు చేర్పులు చేశాం. ఈ సినిమా చూశాక త్రివిక్రమ్ గారు ఒక మాట అన్నారు. ‘దబంగ్’లో హీరో తల్లి ఇన్‌హేలర్ వాడే సీన్ తప్పితే.. ఇంకేదీ ఒరిజినల్ నుంచి తీసుకున్నట్లు లేదు. దాని కోసం ఇన్ని కోట్లు పెట్టి రీమేక్ హక్కులు ఎందుకు కొన్నారు, మార్కెట్లో ఇన్‌హేలర్ తక్కువ ధరకే దొరుకుతుంది కదా అని ఆయన జోక్ చేశారు. ఒరిజినల్‌తో పోలిస్తే నేనెంత మార్చానో చెప్పడానికి ఇది ఉదాహరణ. అలా నేను చేసిన మార్పులు, చేర్పుల్లో అంత్యాక్షరి ఎపిసోడ్ ఒకటి. అది బ్రహ్మాండంగా వర్కవుట్ అయింది. అయినా నా తర్వాతి సినిమాల్లో అలాంటి ఎపిసోడ్ ఇంకోటి పెట్టలేదు.
సందర్భం కుదిరితే తప్ప నేను ఇలాంటివి బలవంతంగా ఇరికించను. ‘ఉస్తాద్’లో అంత్యాక్షరి టైప్ కాదు కానీ.. ఒక మ్యూజిక్ టచ్ ఉన్న ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అది వచ్చినపుడు థియేటర్లు షేకైపోతాయి” అని హరీష్ శంకర్ తెలిపాడు.
This post was last modified on August 31, 2024 7:46 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…