గత కొన్ని రోజులుగా మెగా అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేసిన ‘ఇంద్ర’ మూవీ ఎంతగా సందడి చేసిందో తెలిసిందే. కొత్త సినిమాలకు దీటుగా.. ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలను మించి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టింది. చిరంజీవి సైతం ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, అభిమానుల హంగామా చూసి ఎగ్జైట్ అయ్యారు.
స్వయంగా వీడియో బైట్ ఇవ్వడమే కాక.. రిలీజ్ తర్వాత ‘ఇంద్ర’ టీంనంతా పిలిచి సన్మానం చేశాడు. ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా బాగా జరిగింది. విదేశాల్లో రీ రిలీజ్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాక.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఇంద్ర’ హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. వారం తర్వాత కూడా ‘ఇంద్ర’ ఇంకా ఆడుతుండడం విశేషం.
ఐతే ‘ఇంద్ర’ రీ రిలీజ్ రన్ ముగింపు దశకు వస్తున్న సమయంలోనే మెగా అభిమాలకు ఇంకో పండుగ వచ్చింది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలోనూ రీ రిలీజ్ చేశారు. కానీ ఈసారి హంగామా వేరే లెవెల్లో ఉంది.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక జరుగుతున్న తొలి పుట్టిన రోజు కావడంతో రీ రిలీజ్ ప్లానింగ్ గట్టిగా చేస్తున్నారు. షోలు పెరిగాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. పెట్టిన షోలు పెట్టినట్లు అయిపోతుండడంతో షోలు ముందు అనుకున్న దాని కంటే పెరుగుతున్నాయి. సెప్టెంబరు 1న రాత్రి నుంచే స్పెషల్ షోల హంగామా మొదలు కానుంది. ప్రతి థియేటర్ దగ్గరా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి సంబరాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని పవన్ ఫ్యాన్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
This post was last modified on August 28, 2024 7:53 pm
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…