టాలీవుడ్లో నిలకడగా హిట్లు కొడుతూ, రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో.. నేచురల్ స్టార్ నాని. గత ఏడాది దసరా లాంటి మాస్ మూవీతోనే కాక హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీతోనూ అతను సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే మాస్, క్లాస్ మిక్స్ అయిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రమిది. అలాగే హైప్ పరంగా కూడా నాని కెరీర్లో ఇది టాప్‌లో నిలుస్తుందని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సిటీలో, టౌన్లో ఒక పెద్ద హీరో సినిమా రేంజిలో ఇది రిలీజవుతోంది. హైదరాబాద్ సిటీలో వందల షోలు ఇచ్చారు ‘సరిపోదా శనివారం’ చిత్రానికి. ప్రతి మల్టీప్లెక్స్‌లోనూ మినిమం ఐదు షోలు పడుతున్నాయి. పెద్ద మల్టీప్లెక్సుల్లో అయితే 10 ప్లస్ షోలు వేస్తున్నారు. వాటికి స్పందన కూడా చాలా బాగుంది. బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే.. మల్టీప్లెక్సుల్లో ప్రతి షో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉంది. కొన్ని షోలు సోల్డ్ ఔట్ దశలో ఉన్నాయి.
నానికి ముందు నుంచి క్లాస్ హీరోగా మంచి పేరుంది. తన సినిమాలు మల్టీప్లెక్సుల్లో బాగా ఆడతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్కడ బాగా జరుగుతాయి. సింగిల్ స్క్రీన్లలో మిడ్ రేంజ్ సినిమాలకు ఆశించిన స్పందన ఉండదు. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కూడా సింగిల్ స్క్రీన్లలో బుకింగ్స్ ఓ మోస్తరుగా కనిపిస్తున్నాయంతే. కానీ మల్టీప్లెక్సుల్లో మాత్రం తొలి రోజు ప్రతి షో ఫుల్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ‘సరిపోదా శనివారం’లో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపిస్తోంది.
నాని కెరీర్లోనే ఎన్నడూ చూడనంత హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. కాబట్టి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సింగిల్ స్క్రీన్లు కూడా కళకళలాడే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు రూ.30 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ కనిపిస్తోంది.
This post was last modified on August 27, 2024 10:50 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…