న్యాచురల్ స్టార్ నాని అభిమానులు సందర్భం వచ్చిన ప్రతిసారి అంటే సుందరానికి ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆడాల్సిందని, ప్రేక్షకులకు అర్థం కావడంలో ఎక్కడో పొరపాటు జరిగిందని భావిస్తారు. అయితే నానికి కూడా ఈ మూవీ ప్రత్యేకం. చాలా ఇష్టపడి ప్రేమించి చేశాడు. రిలీజైన టైంలో గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ డిజాస్టర్ కాకపోయినా హిట్టని చెప్పుకోలేని విధంగానే రిజల్ట్ వచ్చింది. తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగం దీనికి సంబంధించిన ప్రశ్న నానికి ఎదురయ్యింది.
దానికి సమాధానం చెబుతూ ప్రేక్షకులు తమ నుంచి ఎంటర్ టైనర్ ఆశించారని, కానీ దాని స్థానంలో స్లోగా నడిచే ఎమోషనల్ లవ్ డ్రామా ఇవ్వడం వల్ల అంచనాలు అందుకోలేకపోయిందని వివరించాడు. ఈసారి పొరపాటు జరగకుండా అదే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఈసారి ఎలాంటి కొలతలు తగ్గకుండా సరిపోదా శనివారంని రూపొందించామని హామీ ఇచ్చాడు. టక్ జగదీశ్, అంటే సుందరానికి మిక్స్డ్, నెగటివ్ రివ్యూలు వచ్చినప్పుడు ఆ ఇద్దరి దర్శకులను తన చోటికి పిలిచి మోటివేట్ చేశానని, ఇది తన కనీస బాధ్యతని నాని చెప్పడం అతనెంత స్పెషలో చెప్పకనే చెబుతుంది
ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఎప్పుడూ లేనిది వివేక్ ఆత్రేయ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఎస్జె సూర్య విలన్ కావడంతో తమిళనాడులో కూడా అదనంగా మార్కెట్ దక్కనుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా పెద్ద క్యాస్టింగే ఉంది. కథ మొత్తం ముందే చెప్పేసి రాజమౌళి తరహాలో ఆడియన్స్ ని సిద్ధం చేస్తున్న శనివారం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పోటీ కూడా లేకపోవడంతో టాక్ రావడం ఆలస్యం హిందీతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో సులభంగా దూసుకుపోవచ్చు.
This post was last modified on August 20, 2024 3:31 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…