సినిమా లాస్ట్ ఆప్షన్… టాలీవుడ్ రియలైజేషన్!

ప్రజలు కష్టాల్లో వుంటే సినిమా వాళ్లే ముందుగా స్పందించారు కానీ ఈ కరోనా కష్ట కాలంలో సినిమానే లాస్ట్ ఆప్షన్ అని కూడా వాళ్ళు గ్రహించేసారు. లాక్ డౌన్ నుంచి నెమ్మదిగా ఉపశమనం ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయాల్సిన సినిమా వాళ్ళకి ఇప్పట్లో షూటింగ్స్ కి అనుమతి రాదనీ అర్ధమయింది.

అందుకే లాక్ డౌన్ ఎత్తిన తర్వాత కూడా నిర్మాణంలో ఉన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని, కొత్త సినిమాలను పరిస్థితులు మామూలు అయ్యే వరకు మొదలు పెట్టరాదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ వందల మంది అవసరం అయ్యే పెద్ద సినిమాలకి ఛాన్స్ లేకపోతే, ఇరవై, ముప్పై మందితో తీసే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, థియేటర్స్ ఎప్పటిలా రన్ అయ్యే వరకు ఓటిటి ప్లాటుఫామ్ టార్గెట్ గా పని చేయాలని అగ్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

ఆర్.ఆర్.ఆర్., ఆచార్య, ప్రభాస్ సినిమా, పుష్ప, మహేష్ సినిమా, వకీల్ సాబ్… ఇవన్నీ సెట్స్ మీదకి వెళ్లడం ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు సినిమా వాళ్లే అభిప్రాయపడుతున్నారు.