భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటనదగ్గ చిత్రం.. ఇండియన్. కమల్ హాసన్ హీరోగా శంకర్ రూపొందించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. తెలుగులో భారతీయుడు, హిందీలో హిందుస్థాని పేరుతో అనువాదమై రెండు చోట్లా విజయవంతమైంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
ఐతే ‘ఇండియన్’ సినిమా చూశాక కమల్ తప్ప సేనాపతి పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరని అనిపిస్తుంది. కొడుకు పాత్రలోనూ ఆయన అంత కన్విన్సింగ్‌గా నటించి మెప్పించారు. కానీ నిజానికి ఈ సినిమాలో కమల్ నటించాల్సిందే కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ కథ రాశాడు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కమల్‌ను సంప్రదించారు. ఆయన ఓకే అనడంతో సినిమా పట్టాలెక్కింది.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కమల్ కూడా ఒప్పుకోకుంటే శంకర్ దృష్టిలో ఇంకో రెండు ఆప్షన్లు ఉన్నాయట. తెలుగు స్టార్లయిన రాజశేఖర్, వెంకటేష్‌లతో ఈ సినిమా తీయాలని శంకర్ అనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి శంకర్ అసిస్టెంట్, తర్వాతి కాలంలో దర్శకుడిగా మారిన వసంత బాలన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమల్ కూడా ఒప్పుకోని పక్షంలో రాజశేఖర్‌తో సేనాపతి పాత్ర చేయించి.. కొడుకు పాత్రను వెంకటేష్‌కు ఇవ్వాలని శంకర్ భావించాడట.
ఐతే కమల్‌కు ‘ఇండియన్’ కథ తెగ నచ్చేసి తండ్రీకొడుకులిద్దరి పాత్రలు తనే చేయడానికి ముందుకొచ్చాడు. ముఖ్యంగా సేనాపతి పాత్ర కోసం ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. దాన్ని అత్యద్భుతంగా పోషించడంతో ఆ పాత్ర జనాలకు విపరీతంగా నచ్చేసింది. సినిమా తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఆలోచిస్తే రాజశేఖర్, వెంకటేష్ సేనాపతి-చందు పాత్రలకు న్యాయం చేయగలిగేవారా అన్న సందేహం కలుగుతుంది.
This post was last modified on July 9, 2024 6:59 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…