కల్కి 2898 ఏడి తారాగణం భారీగా, క్రేజీగా ఉండటంతో ఎక్కువగా ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హైలైట్ అవుతున్నారు కానీ నిజంగా చెప్పుకుంటూ పోతే క్యాస్టింగ్ గురించిన కబుర్లతోనే ఒక పుస్తకం రాసేయొచ్చు. ప్రత్యేకంగా మాళవిక నాయర్ గురించి చెప్పేందుకు కారణముంది. దర్శకుడు నాగ అశ్విన్ ఇప్పటిదాకా తీసింది మూడు సినిమాలు. మొదటి మూవీ ఎవడే సుబ్రమణ్యంలో తనే మెయిన్ హీరోయిన్. టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ కేరళ కుట్టి గ్లామర్ విషయంలో కొంత వెనుకబడటం తప్ప పెర్ఫార్మన్స్ పరంగా ఎప్పుడూ నిరాశ పరిచిన దాఖలాలు లేవు. కల్యాణ వైభోగమే మంచి ఉదాహరణ.
తర్వాత నాగఅశ్విన్ మహానటిలోనూ మాళవిక నాయర్ కు ఒక ముఖ్యమైన క్యామియో ఇచ్చి తన ప్రతిభను వాడుకున్నాడు. తాజాగా కల్కి 2898 ఏడిలో ఇచ్చింది చిన్న వేషమే అయినా కథను మలుపు తిప్పే కీలకమైన క్యారెక్టర్ గా ఇన్ సైడ్ టాక్. రెండో ట్రైలర్ లో చూపించిన షాట్ ని బట్టి ఆకాశం నుంచి రాలిపడే ఒక ఉల్కాలాంటిది మాళవిక గర్భం మీద పడటం చూస్తే ఏదో పెద్ద ట్విస్ట్ తన చుట్టూ అల్లినట్టు కనిపిస్తోంది. ఈ రకంగా నాగఅశ్విన్ మూడు సినిమాల్లో కనిపించిన అరుదైన ఘనత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ కే దక్కింది. తన టాలెంట్ అంత స్పెషల్.
ఇంతే కాదు స్వప్న సినిమాస్ నిర్మించిన అన్నీ మంచి శకునములేలో కోరిమరి తననే హీరోయిన్ గా తీసుకోవడం మంచి పాత్రలకు తను సూటవుతుందనే నాగ అశ్విన్ నమ్మకమే. ఈ సినిమాకు తను దర్శకుడు కాకపోయినా భార్య నిర్మాత కాబట్టి రికమండేషన్ చేసి ఉండొచ్చు. కల్కి మాళవికకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. వరసగా ఆఫర్లు లేకపోయినా అడపాదడపా కనిపిస్తున్న మాళవిక నాయర్ గత నాలుగు చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మరి ప్రభాస్ కి జోడిగా కాకపోయినా కీలకమైన రోల్ కాబట్టి దీని సక్సెస్ లో ఎంతో కొంత షేర్ దక్కితే మళ్ళీ ఆఫర్లు క్యూ కట్టొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates