‘కల్కి’ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్నారని ఆరంభంలో చెప్పినపుడే కాస్టింగ్ పరంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత వీరికి కమల్ హాసన్ కూడా తోడవడంతో ఎగ్జైట్మెంట్ డబులైంది.
పైగా కమల్ చేస్తున్నది విలన్ పాత్ర అని తేలడంతో ప్రభాస్ వెర్సస్ కమల్ ఫైట్ వేరే లెవెల్లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి ఈ క్లాష్ విషయంలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. ముఖ్యంగా కమల్ ఫ్యాన్స్‌కు ‘కల్కి’ విషయంలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.
అందుక్కారణం.. కమల్‌కు ప్రోస్థటిక్ మేకప్ వేసి గుర్తు పట్టని విధంగా తయారు చేయడం. కమల్‌కు భారతీయుడి తరహా మేకప్ వేసే ఓకే కానీ.. కల్కి మేకప్ అయితే అక్కడున్నది కమల్ అని గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. ఆ పాత్రలో కమల్ నటించినా.. టిను ఆనంద్ నటించినా ఒకటే అన్నట్లుగా తయారైంది పరిస్థితి.
ముఖ కవళికలు చూసినా అది కమలే అని చెప్పేలాగా లేదు. ఈ పాత్ర లక్షణాల దృష్ట్యా దాన్ని అలా చూపించడమే కరెక్ట్ కావచ్చు. కానీ అలాంటి పాత్రకే కమల్‌నే ఎంచుకోవాల్సిన అవసరమైతే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమల్ పెర్ఫామెన్స్ అంటూ ఇందులో చూడ్డానికి ఏమీ లేదని.. ఆ పాత్ర ఎవరు చేసినా ఒకటే అని.. కమల్ దీనికి ప్రత్యేకత చేకూర్చడానికి ఛాన్స్ లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అందుకే ‘కల్కి’ రిలీజ్ దగ్గర పడుతుండగా లోకనాయకుడి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం కనిపించడం లేదు. మరి ప్రోమోలు చూసినపుడు కలిగిన అంచనాలకు మించి సినిమాలో కమల్ ఏమైనా భిన్నంగా చేశాడా.. ఆయన మామూలు అవతారంలో కూడా కనిపించి పెర్ఫామెన్స్ పరంగా తన ముద్రను చాటుకుంటాడా అన్నది చూడాలి.