మనమే ఇలాగే నిలబడితే జయమే

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో చెప్పుకోదగ్గ ముద్ర వేసింది మనమే ఒక్కటే. కాజల్ అగర్వాల్ సత్యభామ దాని జానర్ ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ మనమే అయ్యింది. బుక్ మై షో ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజు 55 వేల టికెట్లు అమ్ముడుపోతే రెండు రోజు శనివారం ఏకంగా 67 వేల టికెట్లు సేలయ్యాయి.

ఇవాళ సండే కనీసం లక్షకు పైగా నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇవి అత్యంత భారీ అని చెప్పలేం కానీ మనమేకు వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే డీసెంట్ కన్నా బెటరనే చెప్పాలి. అసలు సవాల్ రేపటి నుంచి ఉంటుంది.

సోమవారం నుంచి డ్రాప్ శాతం ఎంత ఉంటుందనేది బాక్సాఫీస్ స్టేటస్ ని నిర్ణయించబోతోంది. ఒకవేళ కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీని నిలబెట్టుకోగలిగితే హిట్ వైపు పరుగులు పెట్టొచ్చు. కానీ అదంత సులభం కాదు. శర్వానంద్ కృతి శెట్టి జంట, చైల్డ్ సెంటిమెంట్, ఎమోషన్స్, కలర్ ఫుల్ లండన్ విజువల్ ఇలా అన్ని హంగులు ఉన్నట్టు కనిపిస్తున్నా ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మనమే సంతృప్తిపరచలేకపోయింది.

అయినా సరే మరీ బ్యాడ్ గా లేదనే మౌత్ టాక్ శ్రీరామ రక్షలా కాపాడుతోంది. హేశం అబ్దుల్ వహాబ్ పేరుకు పదహారు పాటలు ఇచ్చినా గొప్ప ఆల్బమ్ కాలేకపోయింది.

వచ్చే వారం సుధీర్ బాబు హరోంహరతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు పోటీ ఉన్నాయి కాబట్టి కుటుంబ ప్రేక్షకుల పరంగా చూసుకుంటే మనమేకి ఇంకో వారం ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ టాక్ తో ఎంతమేరకు స్థిరంగా ఉంటుందనేది వేచి చూడాలి.

శర్వానంద్ మాత్రం హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ థియేటర్లకు వెళ్లి ప్రత్యక్షంగా స్పందన తెలుసుకుంటూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ టైంలో దిల్ రాజు ఇలానే చేశారు కానీ ఆ తర్వాత రిజల్ట్ తెలిసిందే. కానీ మనమే కంటెంట్ పరంగా దానికన్నా మెరుగ్గా ఉండటం సానుకూలాంశం.