పిక్‍ టాక్‍: చక్కనమ్మ చిక్కింది

చక్కనమ్మ చిక్కినా అందమే… అంటారు కదా. ఆ మాటతో మీరు ఏకీభవించకపోతే ఒకసారి ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‍ కొత్త లుక్‍ చూడండి. ఈ లాక్‍ డౌన్‍లో చాలా మంది తారలు సరయిన ఎక్సర్‍సైజ్‍ లేక లావెక్కిపోతే, అనుపమ మాత్రం చాలా కేజీల బరువు తగ్గి, నాజూగ్గా తీగలా తయారయింది.

ఇప్పటికే చాలా కాలంగా చూస్తున్నాం కనుక అనుపమ మరీ సీనియర్‍లా అనిపించవచ్చు కానీ ఆమె వయసు ఇప్పుడు ఇరవై నాలుగే. చాలా మంది హీరోయిన్లు కనీసం మొదటి సినిమా కూడా చేసి వుండని ఏజ్‍ ఇది. రాక్షసుడు సినిమాతో హిట్టు కొట్టిన తర్వాత అంతగా అవకాశాలు రాని అనుపమ త్వరలో దిల్‍ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయనుంది.

ఇంతకుముందు కనిపించిన లుక్‍కి పూర్తి భిన్నంగా ఇప్పుడీ నాజూకు రూపంతో మరోసారి కుర్రాళ్ల గుండెల్ని రంపంలా కోసేస్తుందేమో చూడాలి. అన్నట్టు ఇన్‍స్టాగ్రామ్‍లో అనుపమకు డెబ్బయ్‍ అయిదు లక్షల మంది ఫాలోవర్స్ వున్నారండోయ్‍!

All the Streaming/OTT Updates you ever want. In One Place!