ఆ మధ్య కొంత కాలం వరస ఫ్లాపులతో సతమతమైన శ్రీవిష్ణు తిరిగి గాడిన పడ్డాడు. సామజవరగమన ఊహించిన దానికన్నా చాలా పెద్ద సక్సెస్ కావడం మార్కెట్ పరంగా ఎంతో ఉపయోగపడింది. ఈ కారణంగానే ఓం భీం బుష్ మంచి బిజినెస్ చేసుకోగలిగింది. రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు కావడం గమనించాల్సిన విషయం. రేంజ్ పరంగా ఒకటే ఫలితం అందుకోనప్పటికీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు దోహదం చేశాయి. గతంలో రాజా రాజా చోర కూడా వినోదాత్మక జానర్ లోనే వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సీరియస్ బాట పట్టనున్నాడు శ్రీవిష్ణు.
హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందబోయే క్రైమ్ థ్రిల్లర్ లో డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాడు. ఇప్పటికే అరవై శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీలో తనతో రెండోసారి ఈషా రెబ్బ మోనికా హీరోయిన్ గా జోడి కడుతోంది . అనౌన్స్ మెంట్ టీజర్ లో చూచాయగా కాన్సెప్ట్ ఏంటో చెప్పింది కానీ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నేరానికి సంబంధించిన పరిశోధనలో శ్రీవిష్ణు నిమగ్నమైన విజువల్స్ ని మాత్రమే చూపించారు. ఆ మధ్య సీరియస్ గా శ్రీవిష్ణు ట్రై చేసిన భళా తందనాన, అల్లూరి, తిప్పరా మీసం లాంటివి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.
అలా అని పూర్తిగా కామెడీకే కట్టుబడినా అల్లరి నరేష్ లాగా కెరీర్ రిస్క్ లో పడుతుంది. అందుకే అన్ని రకాలుగా ట్రై చేయడం ఉత్తమం. దీని కన్నా ముందు శ్రీవిష్ణు స్వాగ్ రిలీజవుతుంది. ఇది ఎంటర్ టైన్మెంట్ బ్యాచే. ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు ఎంచుకుంటున్న శ్రీవిష్ణు ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలు చేయడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి రెండు అంచనాలు అందుకోకపోయినా ఒక బ్లాక్ బస్టర్ లెక్కను సెటిల్ చేస్తుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అసలే పోటీ ఎక్కువగా ఉన్న ట్రెండ్ లో ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరమే.
This post was last modified on April 17, 2024 9:03 pm
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…