మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అజిత్ తో సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో ఈ దర్శకుడు నెక్స్ట్ ఏ హీరోతో సెట్స్ మీదకు వెళ్తాడనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అజిత్ గత ఏడాది విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడంతో అధిక్ తో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని కోలీవుడ్ వర్గాలు భావించాయి. కానీ అజిత్ తన కొత్త లైనప్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. మొదట రెమ్యునరేషన్ విషయంలో ఆలస్యం జరిగినట్లు టాక్ వచ్చింది. ఆ తరువాత అజిత్ ఇష్టమైన రేసింగ్ కోసం దుబాయ్ వెళ్ళాడు. ఇక రీసెంట్ గా అతని మాతృమూర్తి కన్నుమూశారు. దీంతో అతను ఇప్పట్లో షూటింగ్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక అధిక్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేని ఈ దర్శకుడు, టైమ్ వేస్ట్ కాకుండా వేరే ఆప్షన్స్ వెతుకుతున్నాడు. సరిగ్గా ఈ టైమ్ లోనే టాలీవుడ్ మాస్ స్టార్ నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్య ఇమేజ్ కు సరిపోయే ఒక పక్కా మాస్ కథను అధిక్ సిద్ధం చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఇక యువ దర్శకులకు ఛాన్సులు ఇవ్వడానికి బాలయ్య ఎప్పుడూ ముందుంటాడు. అధిక్ యాక్షన్ టేకింగ్ బాలయ్యకు కరెక్ట్ గా సెట్ అవుతుందని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే తెలుగులో ఒక సాలిడ్ ఎంట్రీ దొరుకుతుందని చెప్పవచ్చు.
మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే అధిక్ ఫస్ట్ ఛాయిస్ కచ్చితంగా అజిత్ ప్రాజెక్ట్ కే ఉంటుంది. స్టార్ హీరోతో కోలీవుడ్ లో సినిమా చేస్తే వచ్చే క్రేజ్ వేరు. అజిత్ డేట్స్ ఇవ్వడానికి మరీ ఎక్కువ టైమ్ పడుతుంది అని క్లారిటీ వస్తేనే, టాలీవుడ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి, మరో తమిళ దర్శకుడితో టాలీవుడ్ హీరో సెట్టవుతాడా లేదా అనేది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు కొరటాల ప్రాజెక్టు కూడా లైన్ లో ఉంది.
This post was last modified on June 1, 2026 12:33 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…