Political News

లోకేష్ బెదిరిస్తున్నాడు.. బాబు బెయిలు రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని టీడీపీ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

అయితే తాజాగా చంద్రబాబు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని, ఆయన తనయుడు లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు రెడ్ డైరీ అంటూ హెచ్చరికలు చేశారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నామని హెచ్చరికలు చేశారని, అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అని అన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.

ఎన్నికలు మరో 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఐడీ పిటీషన్ కలకలం రేపుతున్నది. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదించారు. దీంతో తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మే 7న సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతున్నది అని అంధరూ ఉత్కంఠగా ఉన్నారు.

This post was last modified on April 17, 2024 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

2 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

8 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

11 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

12 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

12 hours ago