టాలీవుడ్ అనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పెద్ది’ విడుదలకు అధికారికంగా ఇంకో మూడు రోజులే సమయం ఉంది. కానీ ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేయడంతో మధ్యలో ఉన్నది రెండు రోజులే. గత రెండు వారాలుగా నాన్ స్టాప్ ప్రమోషన్లతో దేశవ్యాప్తంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఐతే ఈ రోజుల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్ల కంటే ఆన్ లైన్ పబ్లిసిటీనే కీలకంగా మారింది.
బయట అసలేమీ ప్రమోషన్లు చేయకపోయినా పర్వాలేదు.. మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే అదే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. నిజానికి ‘పెద్ది’ మొదట జనాల్లోకి వెళ్లింది ఈ రకమైన కంటెంట్‌తోనే. ఫస్ట్ టీజర్లో బ్యాటింగ్ షాట్, చికిరి పాట వైరల్ అయి ‘పెద్ది’కి బంపర్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అందులో పెద్దగా సర్ప్రైజ్‌లు కనిపించలేదు. వేర్వేరు సినిమాలను కలిపి చూడబోతున్న సంకేతాలు కనిపించాయి.
బుచ్చిబాబు మిగతా ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగానే ప్లాన్ చేశాడు కానీ.. ట్రైలర్ కట్ విషయంలో మాత్రం మెరుపులు మెరిపించలేకపోయాడనే అభిప్రాయం కలిగింది. ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా మీద కాస్త అంచనాలను తగ్గించింది. ఇప్పుడు కంటెంట్ పరంగా తగ్గిన అంచనాలను మళ్లీ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్ వదిలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజానికి దాని అవసరం కూడా చాలానే ఉంది.
‘పెద్ది’ ట్రైలర్ రిలీజయ్యాక కథేంటో జనాలకు బాగా అర్థం అయిపోయింది. సినిమా మొదట్నుంచి చివరి వరకు ఎలా ఉండబోతోందో గెస్ చేసి వీడియోలు చేసేస్తున్నారు నెటిజన్లు. ఐతే వాళ్ల అంచనాలకు మించి సినిమాలో ఏదో ఉంటుందనే ఫీలింగ్ కలిగించేలా రిలీజ్ ట్రైలర్‌ను బుచ్చిబాబు రెడీ చేస్తుండొచ్చని భావిస్తున్నారు. ఈ రోజు విజయవాడలో జరిగే తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో కానీ.. లేదా రేపు కానీ ఈ ట్రైలర్ వస్తుందని తెలుస్తోంది. మరి ఈ ట్రైలర్‌తో బుచ్చిబాబు మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on June 1, 2026 12:48 pm
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…
కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…