Movie News

చరణ్ లైనప్ లో పెద్ది ఇంపాక్ట్

పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్‌లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి. అదే టైమ్‌లో సోలో మార్కెట్‌ని మళ్లీ ప్రూవ్ చేసుకోవాలి. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం అనుకున్నంతగా వర్కౌట్ కాకపోవడంతో ‘పెద్ది’ మీద భారం మరింత పెరిగింది. ఈ ఒక్క సినిమా చరణ్ నెక్స్ట్ 5 ఏళ్ల లైనప్‌ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చరణ్ టేబుల్ మీద మూడు పెద్ద పేర్లు ఉన్నాయి. ఇప్పటికే సుకుమార్ తో కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.

ఇక ఆ తరువాత ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారితో చర్చలు జరుగుతున్నాయి. అనుకున్నట్లు కాంబినేషన్ సెట్ అవ్వాలి అంటే ముందు చరణ్ స్ట్రాంగ్ మార్కెట్ పై మరింత పట్టు సాధించాలి. సుకుమార్ ‘పుష్ప’తో బ్రాండ్ అయ్యాడు. ఈ కాంబినేషన్ లో హిట్ కొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక నీల్ ‘KGF, సలార్’తో మాస్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు. భన్సాలీతో సినిమా అంటే నేషనల్ అవార్డు రేసు. ఈ ఇద్దరిలో ఎవరితో ఫస్ట్ సెట్ అవుతాడనేది ‘పెద్ది’ రిజల్ట్ మీదే ఆధారపడి ఉండవచ్చు.

పెద్ది హిట్ అయితే చరణ్‌కి బేరసారాల పవర్ వస్తుంది. రెమ్యునరేషన్, షేర్స్, రిలీజ్ డేట్ మీద పట్టు ఉంటుంది. కానీ ఫలితం తేడా వస్తే సీన్ రివర్స్ అవుతుంది. అప్పుడు చరణ్‌కి ఆప్షన్స్ తగ్గుతాయి. స్టార్ డైరెక్టర్లు రిస్క్ తీసుకోరు. బడ్జెట్ కంట్రోల్, సబ్జెక్ట్‌లో మార్పులు అడుగుతారు. సీనియర్ల కెరీర్‌లో ఇదివరకే ఇది చూశాం. ఒక్క ఫ్లాప్ వల్ల రెండేళ్లు వెనక్కి వెళ్లిన వారు ఉన్నారు. చరణ్‌కి ఆ పరిస్థితి రాకూడదంటే పెద్ది కచ్చితంగా ఆడాలి.

ఏదేమైనా బుచ్చిబాబు ఈ ప్రెజర్‌ని హ్యాండిల్ చేస్తున్న తీరు కీలకం. ‘ఉప్పెన’ టైమ్‌లో ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు చరణ్ స్టార్‌డమ్, రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు కెమెరా అన్నీ భారీగానే ఉన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి క్లాస్, మాస్ రెండింటికీ రీచ్ అవుతుంది. ఎమోషన్ వర్కౌట్ అయితే ‘రంగస్థలం’ తర్వాత చరణ్‌కి మరో సోలో బ్లాక్‌బస్టర్ పడుతుంది. కాబట్టి పెద్ది చరణ్ కెరీర్‌కి డైరెక్షన్ ఇచ్చే ప్రాజెక్ట్. హిట్ అయితే అనుకున్న భారీ కాంబినేషన్ ప్లాన్ స్మూత్‌గా వెళ్తుంది. తేడా వస్తే లైనప్ మొత్తం తేడా కొడుతుంది. అందుకే ఇండస్ట్రీ మొత్తం పెద్ది ఫస్ట్ రిపోర్ట్ కోసం చూస్తోంది.

This post was last modified on June 1, 2026 12:24 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

54 minutes ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

1 hour ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

2 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

3 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago