Movie News

ప్రమోషన్లు నిల్లు… సినిమా కిల్లు

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనే స్టేట్ మెంట్ కనక నిజమైతే ఏడాదిన్నర ముందు నుంచే రాజమౌళి – మహేష్ బాబు వారణాసికి ఇంత పబ్లిసిటీ ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. ఐపిఎల్ సీజన్ లో కొన్ని సెకండ్ల టీవీ యాడ్ కోసం కోట్లు ఖర్చు పెట్టే కంపెనీలు ఎన్నో. సో సరుకులో ఎంత నాణ్యత ఉన్నా అది జనాలకు తెలియాలంటే ప్రమోషన్లు చాలా కీలకం.

ఇటీవలే బ్లాస్ట్ జోన్ విడుదలయ్యింది. అర్జున్ హీరోగా అభిరామి, ప్రీతీ ముకుందన్ ఆయన భార్యా కూతురిగా నటించారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ బోలెడంత క్రైమ్ ప్లస్ థ్రిల్స్ ఉన్నాయి. టాక్ బాగుంది. తమిళంలో కరుప్పుని తట్టుకుని వసూళ్లు రాబడుతోంది. తెలుగులో కూడా డీసెంట్ రెవిన్యూ ఉంది కానీ టాక్ కు తగ్గట్టు లేకపోవడం ట్రాజెడీ. ఒకవేళ సరైన రీతిలో దీన్ని రిజిస్టర్ చేసుంటే వీకెండ్ తో పాటు పెద్ది వచ్చే దాకా వసూళ్లకు ఛాన్స్ ఉండేది.

ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఒక ప్రెస్ మీట్ తప్ప బ్లాస్ట్ జోన్ కు జరిగిన ప్రమోషన్ సున్నా. అర్జున్ తో సహా టీమ్ మొత్తం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా వాడుకోలేదు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ ఎక్కడా దీని గురించి పెద్దగా సౌండ్ లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసిన నాగవంశీ ఈ విషయం మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే కలెక్షన్లు మెరుగయ్యేవి. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. టాక్ ఏదో ఒక రూపంలో తెలుసుకున్న కాసిన్ని ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు.

టైటిల్ మరో మైనస్ గా నిలిచింది. ఏదో హాలీవుడ్ డబ్బింగ్ తరహాలో బ్లాస్ట్ జోన్ అని పెట్టడం మాస్ వర్గాలకు కనెక్ట్ కాలేదు. నోరు తిరగని ఇలాంటి ఇంగ్లీష్ పేర్లు చేసే చేటు ఎక్కువగా ఉంటుంది. ఊపులో ఉన్న స్టార్ హీరోకు పెడితే ఓకే. కానీ అర్జున్ ఆ క్యాటగిరీ కాదు. అలాంటపుడు ఈజీగా రీచ్ అయ్యే టైటిల్ ఎంచుకోవాలి. ఇలా ఒకపక్క జీరో ప్రమోషన్లు, ఇంకోవైపు నెగటివ్ టైటిల్ రెండు కలిసి మంచి టాక్ వచ్చిన సినిమాని దాని పొటెన్షియాలిటీ వాడకుండా అడ్డం పడ్డాయనేది వాస్తవం.

This post was last modified on June 1, 2026 12:29 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago