బిగ్‍ బాస్‍లో ఇదే ఫస్ట్ టైమ్‍

బిగ్‍ బాస్‍ గత మూడు సీజన్లలో జరగనిది ఈసారి జరిగింది. మొదటి వారంలో హౌస్‍నుంచి ఎలిమినేట్‍ అయిన వాళ్లు లేడీసే అయ్యేవాళ్లు. మొదటి సీజన్‍లో జ్యోతి, రెండవ సీజన్‍లో సంజన, మూడవ సీజన్‍లో హేమ ముందుగా ఎలిమినేట్‍ కాగా నాలుగవ సీజన్‍ ఆ ఆనవాయితీకి బ్రేక్‍ వేసి ఒక పురుష కంటెస్టెంట్‍ని బయటకు పంపారు. అసలే లేడీస్‍ డామినేషన్‍ ఎక్కువగా వున్న ఈ సీజన్లో మరీ మగాళ్లు తగ్గిపోకుండా వెంటనే కమెడియన్‍ కుమార్‍ సాయిని ఇంట్లోకి పంపించేసారనుకోండి. లాస్ట్ త్రీ సీజన్స్లో ఆడవాళ్లు ముందుగా ఎలిమినేట్‍ అయి, ఫైనల్‍గా మగాళ్లే బిగ్‍బాస్‍ టైటిల్‍ గెలుచుకున్నారు.

శివబాలాజీ, కౌశల్‍, రాహుల్‍… ఇలా ఎప్పుడూ మగాళ్లకే పట్టం కడుతూ వచ్చారు. ఈసారి మొదటి వారం సెంటిమెంట్‍ బ్రేక్‍ అయిపోయింది కాబట్టి లేడీ కంటెస్టెంట్‍ విన్నర్‍ అవుతుందనే నమ్మకం బలపడింది. నిజంగానే ఈసారి దేవి, దివి లాంటి కంటెస్టెంట్స్ టఫ్‍గా కనిపిస్తున్నారు. అయితే ముందుకెళ్లే కొద్దీ వీళ్లు ఎలా తట్టుకుని నిలబడతారనేది చూడాలి. ఎందుకంటే మగాళ్లలో నోయల్‍, అభిజీత్‍, సోహైల్‍ టైటిల్‍ గెలవగల సమర్ధులలానే అనిపిస్తున్నారు.

మొదటి వారంలో ఫాన్‍ ఫాలోయింగ్‍ పరంగా దివి లీడింగ్‍లో వుంటే, హౌస్‍మేట్స్ మెప్పు పొందే విషయంలో టీవీ 9 న్యూస్‍ యాంకర్‍ దేవి నాగవల్లి మార్కులన్నీ కొట్టేసింది. ఆమె గురించి అరియానా, సూర్యకిరణ్‍ చెప్పిన మంచి మాటలతో సోషల్‍ మీడియా కూడా ఏకీభవిస్తోంది.