కొందరు నటులు తెర మీద కంటే బయట జనాల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తుంటారు. వాళ్ల చేష్టలు, మాటలు అన్నీ కూడా చర్చనీయాంశం అవుతుంటాయి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ కోవకే చెందుతాడు. మలయాళంలో విలక్షణ పాత్రలతో అతను మంచి గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా షైన్ చేసిన నెగెటివ్ క్యారెక్టర్లు ఆయా సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యాయి. తన క్యారెక్టర్లు అదో టైపులో ఉంటాయి. బయట కూడా అతను కొంచెం భిన్నంగానే ప్రవర్తిస్తుంటాడు.
‘దసరా’, ‘రంగబలి’ లాంటి చిత్రాలతో షైన్ తెలుగులో కూడా మంచి గుర్తింపే సంపాదించాడు. తన పాత్రలను మించి.. బయట ఇంటర్వ్యూల్లో అతడి చేష్టలు చర్చనీయాంశం అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ షర్ట్ బాగుందంటే అప్పటికప్పుడు విప్పి ఇచ్చేయడానికి చూడటం లాంటి చర్యలు చూసి జనాలు షాకయ్యారు. ఈ క్రమంలోనే బయట షైన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేసిన వీడియోలు చాలా వెలుగులోకి వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐతే ఇప్పుడు షైన్ తెలుగులో ఒప్పుకున్న కొత్త చిత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. నందమూరి బాలకృష్ణతో షైన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో షైన్ నటిస్తున్నాడట. బాలయ్య కూడా బయట కొంచెం డిఫరెంట్‌గానే బిహేవ్ చేస్తుంటాడు. ఆయనది టిపికల్ క్యారెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోపం వస్తే అభిమానుల మీద చేయి చేసుకోవడం.. ఫోన్లు విసిరేయడం లాంటి ఆయన చర్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే.
ఈ నేపథ్యంలో భిన్నమైన వ్యక్తిత్వాలున్న ఇద్దరు నటులు ఒక సినిమా కోసం కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఇప్పుడు మీమ్స్ రెడీ చేసి వదులుతున్నారు నెటిజన్లు. అవి చాలా ఫన్నీగా ఉన్నాయి. వీళ్లిద్దరినీ తెర మీద చూడటం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. బాబీ భలే కాంబినేషన్ సెట్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on March 13, 2024 5:23 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…