Movie News

తన ‘వేగం’పై రాజమౌళి సెల్ఫ్ ట్రోల్

రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే. కథ తయారీకే ఆయనకు సంవత్సరం తక్కువ కాకుండా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులకు ఆర్నెల్ల నుంచి సంవత్సరం దాకా వెచ్చిస్తారు. ఇక మేకింగ్‌కు కనీసం రెండేళ్లు పడుతుంది. అలా ఒక్కో సినిమాకు మినిమం నాలుగేళ్లు టైం పెడుతున్నాడు జక్కన్న. ఐతే ఔట్ పుట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కాలమైనా వెచ్చిస్తారు. ప్రేక్షకులు కూడా ఎంత సమయమైనా ఎదురు చూస్తారు.

ఒక్క మర్యాద రామన్నను పక్కన పెడితే ‘మగధీర’ నుంచి జక్కన్న సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలకు ముందు ఒక రిలీజ్ డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం అన్నది చాలా కామన్ అయిపోయింది. రాజమౌళిని కొనియాడుతూనే.. ఆయన సినిమాలకు ఏళ్లకు ఏళ్లు సమయం పట్టడం.. ఆయన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడటం గురించి సోషల్ మీడియాలో సరదాగానే పంచులు వేస్తుంటారు జనాలు.

ఐతే ఇప్పుడు రాజమౌళే స్వయంగా తన మీద తాను పంచ్ వేసుకున్నాడు. తన కొడుకు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ సినిమాకు మంచి ఫలితం దక్కిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో జక్కన్న పాల్గొన్నాడు. యంగ్ టీంను కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎంత వేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి చకచకా రిలీజ్ చేశామో వివరించాడు.

అతను మాట్లాడుతుండగా.. జక్కన్న కలుగజేసుకుని “రేయ్.. నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్‌గా చేశాం, వారం రోజుల్లో చేశాం. పంపించాం అని చెప్పకురా” అని అనడంతో కార్తికేయ సహా స్టేజ్ మీద ఉన్న వారంతా ఘొల్లుమన్నారు. రాజమౌళి స్థాయి దర్శకుడు తన మీద ఇలా సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడం ఆయన ఎంతటి సరదా మనిషో తెలియజేస్తుంది. ఇక ‘ప్రేమలు’ సినిమాలో మైన్యూట్ డీటైల్స్ ప్రస్తావిస్తూ.. ఈ వేడుకలో టీం సభ్యులను జక్కన్న పొగిడిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.

This post was last modified on March 13, 2024 2:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

1 hour ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

2 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

11 hours ago