దేశంలో సినిమా వాళ్లు రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపించింది తమిళనాడులోనే. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులను అందించింది సినీ పరిశ్రమ. తమిళనాట సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నది సినిమా వాళ్లే. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ వారసుడిగా భావిస్తున్న ఉదయనిధి స్టాలిన్ సైతం సినిమా వాడే. లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ.. ఆయనకు కలిసి రాక సైడ్ అయిపోయారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి తగ్గారు. ఇప్పుడు దళపతి విజయ్ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతామన్న లక్ష్యంతో ఒక ప్రణాళిక ప్రకారమే విజయ్ అడుగులు వేస్తున్నారు.
ఐతే తమిళనాడులో కమల్ హాసన్.. తెలుగునాట చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుభవాలు చూసి విజయ్‌కి ఛాన్స్ లేదని తేలిగ్గా తీసిపడేస్తున్నారు కొంతమంది. సినిమా వాళ్లను జనం ముందులాగా నమ్మట్లేదని కామెంట్లు చేస్తున్నారు. కానీ విజయ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అతడికి తమిళనాట అనుకూల పరిస్థితులే ఉన్నాయని వారంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న స్టాలిన్ పాలన పట్ల జనం ఏమంత సంతృప్తిగా లేరు. వేరే ఆప్షన్ లేకే డీఎంకేకు జనం పట్టం కట్టారు. కానీ స్టాలిన్ పనితనం అంతంతమాత్రంగానే అనిపిస్తోంది. ఆయన ఆకర్షణ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న స్టాలిన్‌లో చురుకుదనం కొరవడింది.
ఉదయనిధి పార్టీని, ప్రభుత్వాన్ని హోల్డ్ చేసేంత సమర్థుడిగా కనిపించడం లేదు. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ బాగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయం. అన్నామలై నాయకత్వంలో బీజేపీ కొంత రైజ్ అవుతోంది కానీ.. అధికారం చేపట్టే స్థాయికి వెళ్లాలంటే చాలా కాలం పడుతుంది. మొత్తంగా చూస్తే తమిళనాట ఒక విజయ్‌కి ఒక వాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. గత కొన్నేళ్లలో రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టి అతి పెద్ద స్టార్‌గా అవతరించాడు విజయ్. బడుగు, బలహీన వర్గాల్లో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ వినమ్రంగా కనిపిస్తాడు. తక్కువ మాట్లాడతాడు. హుందాగా నడుచుకుంటాడు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ.. పార్టీ నిర్మాణం ప్రణాళిక ప్రకారం చేసి, ఎన్నికల బరిలో దిగితే.. మరోవైపు స్టాలిన్ సర్కారు మీద వ్యతిరేకత మరింత పెరిగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ జయకేతనం ఎగురవేసి సీఎం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on February 6, 2024 2:57 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…