‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడంతో దాన్ని అక్కడి సెలబ్రెటీలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదొక అద్భుతం అంటూ కొనియాడారు. కానీ ఆ చిత్రమే ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ప్రాధాన్యాన్ని తగ్గించేసింది. సౌత్ చిత్రాల హవా పెరిగిపోయి బాలీవుడ్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది.
దీంతో తర్వాత సౌత్ సినిమాలను సపోర్ట్ చేయడం తగ్గించేశారు బాలీవుడ్ సెలబ్రెటీలు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటించినా.. ఇండస్ట్రీ సైలెంటుగానే ఉంది. ‘కేజీఎఫ్-2’, ‘పుష్ప-2’ చిత్రాలు నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసినా సౌండ్ లేదు. ఈ సినిమాలన్నింటినీ చూసి అక్కడి వాళ్లు అసూయ పడ్డ సంకేతాలు కనిపించాయి. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ కొత్త సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అండగా నిలవబోతుండడం విశేషం.
తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కానుకగా విడుదల కాబోతోంది. ముందు రోజు అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ఈ గ్లింప్స్‌ను లాంచ్ చేయబోతున్నారట. ముంబయిలో షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ కానుండగా.. వర్చువల్‌గా బన్నీ, అట్లీ అండ్ టీం ఈ కార్యక్రమంలో పాల్గొంటుందని సమాచారం.
ఈ గ్లింప్స్‌ను షారుఖ్ లాంచ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ‘జవాన్’ రూపంలో అట్లీ.. షారుఖ్‌కు భారీ విజయాన్ని అందించాడు. అతడితో షారుఖ్ మరో సినిమా కూడా చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బన్నీతో అట్లీ సినిమాకు సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారంగానే చూడాలి. త్వరలో ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
బన్నీ, అట్లీ ఇద్దరూ సౌత్ వాళ్లే. కానీ నార్త్‌లో ఫాలోయింగ్ ఉంది. అయినా సరే.. షారుఖ్ చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజైతే వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇక ఈ గ్లింప్స్ ఒక రేంజిలో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on March 11, 2026 4:48 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…