హనుమాన్ ఓవర్ ఫ్లోస్.. వాటికి ప్లస్

పండుగ సమయంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంటుంది. పెద్ద సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. జనం పక్కన ఉన్న చిన్న సినిమా వైపు చూస్తారు. ఇలా ఓవర్ ఫ్లోస్ కలిసి వచ్చి మంచి సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఒక షాకింగ్ ట్రెండ్ చూస్తున్నాం. ఓ చిన్న సినిమా ఫ్లోస్ ను పెద్ద సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈసారి పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో బడ్జెట్, కాస్ట్ పరంగా.. హనుమానే చిన్న సినిమా.

కానీ ఈ సినిమాకు మంచి టాక్ రావడం, బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులన్నీ కలిసి రావడంతో చాలా పెద్ద రేంజికి వెళుతోంది. ఈ సినిమాకి చాలిలన్ని స్క్రీన్లు దక్కకపోవడంతో టికెట్లు దొరకడం చాలా కష్టం అయిపోతోంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇప్పుడున్న దాంట్లో డబుల్ స్క్రీన్లు ఇచ్చినా ఫుల్స్ పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కానీ నెమ్మదిగా స్క్రీన్లు పెరుగుతున్నాయి కానీ సరిపోవడం లేదు.

ఈ పరిస్థితి వేరే సినిమాలకు అడ్వాంటేజ్ అవుతోంది. పండుగ సమయంలో సినిమాలు చూడటం అలవాటు అయిన తెలుగు ప్రేక్షకులు.. థియేటర్ల దగ్గరికి వెళ్లి హనుమాన్ టికెట్ల కోసం అడగడం.. అవి లేకపోవడంతో వేరే ఛాయిస్ తీసుకోవడం జరుగుతోంది. ఆ రకంగా శుక్ర, శనివారాల్లో గుంటూరు కారం సినిమా బాగా లాభపడింది. అయితే ఆదివారం రిలీజ్ అయిన నా సామి రంగ చిత్రానికి డీసెంట్ టాక్ రావడంతో.. ఇక నుంచి హనుమాన్ తర్వాత ప్రేక్షకులకు సెకండ్ ఛాయిస్ అదే కాబోతోంది.

అందుకే ఉదయం కొంచెం డల్ గా మొదలైనప్పటికీ.. మ్యాట్నీల నుంచి ఈ సినిమా బాగా పుంజుకుంది. ఈవినింగ్, నైట్ షోలకు ఫుడ్స్ పడిపోతున్నాయి. వచ్చే రెండు మూడు రోజులు కూడా హనుమాన్ ఓవర్ ఫ్లోస్ నా సామి రంగ, అలాగే గుంటూరు కారం చిత్రానికి ప్లస్ అయ్యేలాగా ఉన్నాయి. కానీ వెంకటేష్ సినిమా సైంధవ్ మాత్రం పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో దానికి గట్టి దెబ్బ పడేలా ఉంది.